తల్లి కాబోయే ముందు పవిత్ర యాత్రలో సానియా మిర్జా దంపతులు

హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి ముందే టెన్నిస్ స్టార్ సానియామీర్జా, ఆమె భర్త పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తల్లిదండ్రులతో కలిసి ఉమ్రా యాత్రకు వచ్చారు. భర్త, తల్లిదండ్రులతో కలిసి సానియా మిర్జా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి సౌదీ అరేబియాకు ఉమ్రా యాత్ర కోసం వచ్చారు.
పుట్టబోయే బిడ్డకు అల్లా దీవెనల కోసం సానియా దంపతులు ఈ యాత్ర చేపట్టినట్టు తెసుస్తోంది. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి ముందే సానియా తన కుటుంబ సభ్యులతో కలసి ఉమ్రా యాత్రకు వెళ్లిన ఫొటోలను షోయబ్ మాలిక్ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
షోయబ్ మాలిక్ ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో అభిమానుల నుంచి కామెంట్లు వెల్లువెత్తాయి. ఉమ్రా యాత్రకు వచ్చిన మీకు అల్లా దీవెనలు మీకు ఉంటాయి అని అంటూ ఈ ఫొటోపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. కాగా, తాను తల్లి కాబోతున్న విషయాన్ని గత నెలలో సానియా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications