సానియా ఎగ్జైట్, నా అదృష్టమని ఫెదరర్: లారాదత్తాతో సూపర్‌స్టార్ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: భారత గడ్డపై స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అరంగేట్రం అదిరింది. ఫెడెక్స్ సూపర్ షోతో అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ సొంతగడ్డపైనా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. మిక్స్‌డ్, పురుషుల డబుల్స్, సింగిల్స్‌లో ఫెడరర్ అద్భుత ప్రదర్శన చేయడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో ఏసెస్ 26-16తో సింగపూర్ స్లామర్స్‌పై ఘన విజయం సాధించింది.
మనీలా, సింగపూర్ లెగ్‌లలో బరిలోకి దిగని ఫెదరర్.. భారత్‌లో తన రాకను ఘనంగా చాటుకున్నాడు. తొలుత సింగిల్స్‌లో ఏసెస్ ఆటగాడు పీట్ సంప్రాస్ 2-6తో ప్యాట్రిక్ రాఫ్టర్ చేతిలో ఓడి నిరాశపర్చాడు. అయితే మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫెదరర్ - సానియా మీర్జా (ఏసెస్) జోడీ 6-0తో హంతుచోవా-కిర్గియోస్ ద్వ యాన్ని చిత్తు చేసింది. ఫెదరర్‌తో ఆడటాన్ని సానియా ఎగ్జైట్‌గా ఫీలయ్యారు.
పురుషుల డబుల్స్‌లో ఫెదరర్ - రోహన్ బోపన్న (ఏసెస్) జోడీ 6-1తో లీటన్ హెవిట్-నిక్ కిర్గియోస్ ద్వయంపై నెగ్గింది. ఇక సింగిల్స్‌లోనూ ఫెడరర్ 6-4తో థామస్ బెర్డిచ్‌ను ఓడించాడు. ఇక ఆఖరి, మహిళల సింగిల్స్‌లో ఇవనోవిచ్ (ఏసెస్) 6-5 (7/5)తో హంతుచోవాపై చెమటోడ్చి గెలిచింది. ఈ లీగ్‌లో ఏసెస్‌కు ఇది ఆరో విజయం. దీంతో ఏసెస్ 28 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
మరో మ్యాచ్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ప్రాతినిథ్యం వహిస్తున్న యూఏఈ రాయల్స్ 24-27తో మనీల మావెరిక్స్ చేతిలో ఓటమి పాలైంది. దిగ్గజ పోరులో ఇవానిసెవిచ్ (రాయల్స్) 3-6తో ఫిలిప్పోసిస్ చేతిలో ఓడాడు. పురుషుల సింగిల్స్‌లో సిలిచ్ (రాయల్స్) 6-5తో సోంగాపై గెలిచాడు. ఇక పురుషుల డబుల్స్‌లో జొకోవిచ్ - జిమోంజిక్ (రాయల్స్), మిక్స్‌డ్‌లో జిమోంజిక్-మ్లడెనోవిచ్ జోడీలు ఓడాయి.

సానియా, ఫెదరర్
రోజర్‌తో ఆడటం గొప్ప గౌరవమని, అతనితో ఆస్ట్రేలియా ఓపెన్ ఆడాలనుకుంటున్నానని సానియా మీర్జా సరదాగా వ్యాఖ్యానించారు.

సానియా మీర్జా
భారత్‌లో ఆడటం చాలా ఆనందాన్ని ఇస్తోందని, గొప్ప చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలున్న ప్రదేశంలో ఆడటం సంతోషాన్ని ఇస్తోందని రోజర్ ఫెదరర్ అన్నారు.

ఫెదరర్
మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో సింగపూర్ స్లామర్స్ పైన పాయింట్ వచ్చిన సమయంలో రోజర్ ఫెదరర్ ఉత్సాహం దృశ్యం.

సానియా మీర్జా
మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో సింగపూర్ స్లామర్స్ పైన గెలిచిన అనంతరం తోటి ప్లేయర్లతో ఆనందం పంచుకుంటున్న సానియా మీర్జా.

అమితాబ్, లారా
న్యూఢిల్లీలో ఐపీటీఎల్ మ్యాచ్ సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, హీరోయిన్ లారా దత్తాల ముచ్చట్ల దృశ్యం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications