Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుమార్తె పుట్టినరోజుని ఘనంగా: సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Photos: Mahesh Bhupathi, wife Lara Dutta wish cutie daughter Saira on her 6th birthday

హైదరాబాద్: భారత వెటరన్ టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి, బాలీవుడ్ నటి లారా దత్తాలు తమ కుమార్తె పుట్టినరోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. మహేశ్ భూపతి, లారా దత్తా 2011లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ మరుసటి ఏడాది లారా దత్తా ఓ కుమార్తెకు జన్మనిచ్చింది.

ప్రస్తుతం ఆ పాప వయసు ఆరేళ్లు. జనవరి 20వ తేదీన తన ఆరో పుట్టినరోజుని జరుపుకుంటున్న తమ ముద్దుల కుమార్తె కైరా పుట్టినరోజుని ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను లారా దత్తా తన ఇనిస్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది.

ఇక, మహేశ్ భూపతి విషయానికి వస్తే, లియాండర్ పేస్‌తో కలిసి భారత్ టెన్నిస్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలనందించాడు. ముఖ్యంగా భారత టెన్నిస్‌లో పురుషుల డబుల్స్‌లో వీరిది అత్యుత్తమ జోడీగా పేరుగాంచింది. తన కుమార్తె పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు తెలుపుతూ చిన్నప్పటి ఫోటోలను జత చేసి ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

ప్రస్తుతం చిన్నారి కైరా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన మహేశ్ భూపతి భారత టెన్నిస్‌కు అత్యుత్తమ క్రీడాకారులను అందించేందుకు గాను మహేశ్ భూపతి టెన్నిస్ అకాడమీస్ పేరిట ఓ అకాడమీని నెలకొల్పాడు.

ఇక 39 ఏళ్ల లారా దత్తా 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్‌ కిరీటాన్ని గెలుచుకుంది. మహమ్మద్ అజహరుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా 2016లో రూపొందించిన అజహర్ అనే సినిమాలో నటించింది. అంతేకాదు బాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాల్లో కూడా లారా దత్తా నటించింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, January 20, 2018, 15:30 [IST]
Other articles published on Jan 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+