Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించేదెవరు?: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో నాదల్ Vs ఫెదరర్

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో చరిత్రలో అరుదైన మ్యాచ్ ఆదివారం జరగనుంది. స్పెయిన్ టెన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్ తన కెరీర్‌లో 15వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో సెమీఫైనల్లో తొమ్మిదో సీడ్‌ నాదల్‌ 4 గంటల 56 నిమిషాల్లో 6-3, 5-7, 7-6 (7/5), 6-7 (4/7), 6-4తో బల్గేరియా ఆటగాడు, 15వ సీడ్‌ గ్రిగోర్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా)పై విజయం సాధించి పైనల్స్‌కు దూసుకెళ్లాడు.

మ్యాచ్ సమయం: 2PM IST
ఏ టీవీలో ప్రసారం: LIVE on Sony SIX, HD

దీంతో ఆదివారం జరిగే ఫైనల్లో 17వ సీడ్, మాజీ చాంపియన్ రోజర్‌ ఫెదరర్(స్విట్జర్లాండ్‌)తో నాదల్‌ తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో నాదల్ విజేతగా నిలిస్తే, ఓపెన్‌ ఎరాలో ఒక్కో గ్రాండ్‌స్లామ్‌ను రెండుసార్లు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. మొత్తంగా ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా నాదల్ చరిత్ర సృష్టిస్తాడు.

ఫెడరర్‌తో 35వసారి తలపడనున్న నాదల్‌

ఫెడరర్‌తో 35వసారి తలపడనున్న నాదల్‌

రోజర్ ఫెడరర్‌తో 35వసారి తలపడనున్న నాదల్‌ టైటిల్‌ పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. ముఖాముఖి రికార్డులో నాదల్ 23-11తో ఫెదరర్‌పై ఆధిక్యంలో నిలిచాడు. 2009లో ఫెదరర్‌ను ఓడించి టైటిల్‌ నెగ్గిన నాదల్ మరోసారి ఆ ఫీట్‌ను పునరావృతం చేస్తాడో లేదో ఈ మ్యాచ్‌లో చూడాలి.

2011 ఫ్రెంచ్‌ ఓపెన్ తర్వాత ఇదే తొలిసారి

2011 ఫ్రెంచ్‌ ఓపెన్ తర్వాత ఇదే తొలిసారి

అంతేకాదు 2011 ఫ్రెంచ్‌ ఓపెన్ టోర్నీ తర్వాత వీరిద్దరూ ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్లో తలపడనుండటం ఇదే తొలిసారి. ఇక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మ్యాచ్‌ల ముఖాముఖి రికార్డులో కూడా నాదల్‌ 9-2తో ఫెదరర్‌పై ఆధిక్యంలో నిలిచాడు. గతంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వీరిద్దరూ మూడుసార్లు తలపడగా మూడుసార్లూ నాదల్‌నే విజయం వరించింది.

నాదల్‌ను ఓడించి ఫెదరర్‌కు ఏడు సంవత్సరాలైంది

నాదల్‌ను ఓడించి ఫెదరర్‌కు ఏడు సంవత్సరాలైంది

ఇదిలా ఉంటే ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మ్యాచ్‌లో నాదల్‌ను ఓడించి ఫెదరర్‌కు ఏడు సంవత్సరాలైంది. చివరిసారిగా 2007లో జరిగిన వింబుల్డన్ ఫైనల్లో ఐదు సెట్‌ల పోరులో నాదల్‌పై ఫెదరర్ విజయం సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో పెదరర్ విజయం సాధిస్తే తన ఖాతాలో 18వ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్ చేరుతుంది.

నాదల్ భావోద్వేగం

నాదల్ భావోద్వేగం

రెండేళ్ల విరామం తర్వాత ఒక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌కు వెళ్లిన ఆనందంలో నాదల్‌ భావోద్వేగానికి గురయ్యాడు. దిమిత్రోవ్‌ అనవసర తప్పిదం చేయడంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం కోర్టులో బోర్లా పడిపోయిన నాదల్ సంతోషంలో మునిగిపోయాడు. రిస్ట్‌ బ్యాండ్‌ అభిమానుల్లోకి గిరాటేసి తాను సాధించానన్నట్లు గాల్లోకి పంచ్‌లు విసిరాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+