Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Wimbledon 2022 : చరిత్ర నెలకొల్పిన ఒన్స్ జుబేర్.. వింబుల్డన్ ఫైనల్ చేరిన తొలి ఆఫ్రికన్ మహిళగా రికార్డ్

Ons Jabeur Became the First and Only Woman to Reach Wimbledon Grandslam Final

వింబుల్డన్ సెమీ ఫైనల్స్‌లో జర్మనీ ప్లేయర్ టట్జానా మారియాను ఓడించిన ట్యునీషియా ప్లేయర్ ఒన్స్ జబీర్ ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఒక గ్రాండ్ స్లామ్ పోటీల్లో ఫైనల్‌కు చేరిన ప్రస్తుత తరంలో తొలి ఆఫ్రికన్ మహిళగా ఒన్స్ జబీర్ నిలిచింది. ట్యునీషియాకు చెందిన ఈ 27ఏళ్ల ప్రపంచ నంబర్ 2 ప్లేయర్.. సెమీస్లో 6-2, 3-6, 6-1 పాయింట్లతో టట్జానా మారియాను చిత్తు చేసింది. ఇక శనివారం జరిగే ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో సిమోనా హాలెప్ లేదా ఎలెనా రిబాకినాతో ఆమె తలపడబోతుంది. ఇక ఇప్పటికే గ్రాండ్ స్లామ్ సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించిన మొదటి అరబ్ ప్లేయర్‌గా చరిత్ర నెలకొల్పిన ఓన్స్ జబీర్.. ఇక ఫైనల్ చేరి అబ్బురపరిచింది. ఇక గెలిచిన అనంతరం జబీర్ మాట్లాడుతూ.. 'నేను ఫైనల్ చేరినందుకు చాలా గర్వపడుతున్నాను. ట్యునీషియా దేశ బిడ్డగా నన్ను నేను చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను. ' అని అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఇక అంతకుముందు 1927 ఫ్రెంచ్ ఓపెన్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన ఐరీన్ బౌడర్ పీకాక్ తొలిసారి గ్రాండ్ స్లామ్ చేరిన ఆఫ్రికన్ మహిళగా నిలిచింది. ఇక 1959ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెనీ షుర్మాన్ స్లామ్ సింగిల్స్ ఫైనల్‌కు చేరుకున్న ఏకైక ఆఫ్రికన్ మహిళగా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరిన తొలి ఆఫ్రికన్ మహిళగా ట్యునీషియా ప్లేయర్ ఒన్స్ జబీర్ నిలిచింది. ఇక ఈ విజయం గురించి జబీర్ మాట్లాడుతూ.. 'సంవత్సరాల శ్రమ, త్యాగం వల్ల ఈ కల నిజమైంది. ఇది ఫలించినందుకు సంతోషంగా ఉంది. నేను ఫైనల్లో కూడా గెలుస్తాననే నమ్మకముంది. ట్యునీషియాలో నా విజయం తప్పకుండా నా దేశ ప్రజలకు అమితానందాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. మరింత మంది అరబ్ మరియు ఆఫ్రికన్ ఆటగాళ్లను గ్రాండ్ స్లామ్ ఈవెంట్లలో చూడాలనుకుంటున్నాను.' అని ఆమె తెలిపింది.

Story first published: Thursday, July 7, 2022, 21:47 [IST]
Other articles published on Jul 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+