న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జకోవిచ్‌దే మాడ్రిడ్‌ ఓపెన్‌.. సిట్సిపాస్‌కు నిరాశే

Novak Djokovic Wins Third Madrid Open Title, 33rd Masters

సెర్బియా స్టార్ నొవాక్‌ జకోవిచ్‌ మాడ్రిడ్‌ ఓపెన్‌-2019 టైటిల్ గెలుచుకున్నాడు. దీంతో జకోవిచ్‌ మాడ్రిడ్‌ ఓపెన్‌ను మూడోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు 33వ మాస్టర్ ఛాంపియన్ టైటిల్ సాధించి క్లే కోర్టు రారాజు, స్పెయిన్ బుల్ రఫెల్‌ నాదల్‌ సరసన జకోవిచ్‌ చేరాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్ మ్యాచ్‌లో జకోవిచ్‌ 6-3, 6-4తో గ్రీకు యువ ఆటగాడు సిట్సిపాస్‌పై విజయం సాధించాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

కేవలం 90 నిమిషాల్లో జకోవిచ్‌ మ్యాచ్ ముగించాడు. వరుస సెట్లలో జకోవిచ్‌ జోరు ముందు సిట్సిపాస్‌ తలొంచాడు. సెమీఫైనల్లో సిట్సిపాస్‌ 4-6, 6-2, 3-6తో నాదల్‌ను ఓడించిన విషయం తెలిసిందే. ఫైనల్లో కూడా జకోవిచ్‌కు షాక్ ఇస్తాడని అందరూ అనుకున్నా.. జకోవిచ్‌ మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు.

'ఈ విజయం నాకు చాలా ముఖ్యం. ఇది నాలో మరింత ఆత్మవిశ్వాసంను నింపింది. ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత నేను బాగా ఆడలేదు. ఈ వారం మాత్రం చాలా బాగా ఆడా. ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. ఇక్కడ నా కెరీర్‌లో ఉత్తమమైన టెన్నిస్ ఆడాను' అని జకోవిచ్‌ అన్నారు.

Story first published: Monday, May 13, 2019, 17:47 [IST]
Other articles published on May 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X