For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన నొవాక్ జకోవిచ్

Wimbledon 2025: ఏడు సార్లు ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ 2025 వింబుల్డన్ టోర్నమెంట్‌లో తనదైన ముద్ర వేశాడు. నాలుగో రౌండ్‌లో అలెక్స్ డి మినార్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మొదటి సెట్ కోల్పోయినప్పటికీ అద్భుతంగా పుంజుకొని తర్వాతి మూడు సెట్లు గెలిచి మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఉత్కంఠగా సాగిన మ్యాచ్
ఆదిలో తడబడినప్పటికీ జకోవిచ్ అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించాడు. 2016 తర్వాత వింబుల్డన్‌లో ఇంత త్వరగా బయటపడే ప్రమాదం ఉన్నప్పటికీ జకోవిచ్ డి మినార్‌ను 1-6, 6-4, 6-4, 6-4తో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. మ్యాచ్ చూసేందుకు ఎనిమిదిసార్లు వింబుల్డన్ ఛాంపియన్ రోజర్ ఫెదరర్ కూడా రాయల్ బాక్స్‌లో ఉన్నాడు. 38 ఏళ్ల జకోవిచ్ పేలవమైన ఆరంభం చేసి మొదటి సెట్‌ను చేజార్చుకున్నాడు. అయితే జకోవిచ్ వెంటనే పుంజుకుని తర్వాతి రెండు సెట్లు గెలిచి 2-1 ఆధిక్యంలో నిలిచారు. నాలుగో సెట్‌లో డి మినార్ మళ్లీ 4-2 ఆధిక్యం సాధించాడు. కానీ ప్రపంచ మాజీ నంబర్ వన్ ఆటగాడు జకోవిచ్ వరుసగా రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను, మ్యాచ్‌ను గెలుచుకున్నాడు.

Novak Djokovic Storms into Wimbledon 2025 Quarterfinals

తదుపరి ప్రత్యర్థి ఫ్లావియో కోబోలి
ఎనిమిదో వింబుల్డన్ టైటిల్, రికార్డును మెరుగుపరిచే 25వ సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం ప్రయత్నిస్తున్న జకోవిచ్ తదుపరి రౌండ్‌లో ఇటలీకి చెందిన 22వ సీడ్ ఫ్లావియో కోబోలితో తలపడనున్నారు. ఫ్లావియో కోబోలి 2014 యూఎస్ ఓపెన్ ఛాంపియన్ మారిన్ సిలిక్‌ను 6-4, 6-4, 6-7, 7-6తో ఓడించి తన కెరీర్‌లో తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు.

జకోవిచ్ రికార్డుల పరంపర
ఈ విజయం నొవాక్ జకోవిచ్ కు వింబుల్డన్ టోర్నమెంట్‌ లో 101వ విజయం. ఇటీవలే జకోవిచ్ వింబుల్డన్ లో తన 100వ విజయాన్ని పూర్తి చేసుకున్నాడు. జకోవిచ్ ఇప్పుడు రోజర్ ఫెదరర్ ఎనిమిది వింబుల్డన్ టైటిళ్ల రికార్డును సమం చేసేందుకు చేరువలో ఉన్నారు. ప్రత్యేకించి జకోవిచ్ 16వ సారి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు.

Story first published: Tuesday, July 8, 2025, 8:54 [IST]
Other articles published on Jul 8, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+