Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి ఆటగాడిగా అరుదైన ఘనత: No.1 ట్రోఫీతో జొకోవిచ్

Novak Djokovic presented with year-end No.1 trophy at Nitto ATP Finals!

హైదరాబాద్: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ ఏటీపీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం టెన్నిస్ వరల్డ్‌లో వరుస టైటిల్స్ సాధించి జోరు మీదున్న జొకోవిచ్ తిరిగి నంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకున్నాడు. అసోసియేషన్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపి) సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 8,045 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

ఈ ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడంతో నొవాక్ జొకోవిచ్ తన రేటింగ్ పాయింట్స్‌ను మెరుగుపరచుకున్నాడు. ఈ ఏడాది మొదట్లో వింబుల్డన్ పరుషుల సింగిల్స్ టైటిల్‌తో పాటు అమెరికన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు. దీంతో జొకోవిచ్ ఖాతాలో గ్రాండ్ స్లామ్ టైటిళ్ల సంఖ్య పద్నాలుగుకు చేరింది.

రెండు ప్రతిష్టాత్మక టైటిల్స్‌తో

రెండు ప్రతిష్టాత్మక టైటిల్స్‌తో

ఈ ఏడాది ఈ రెండు ప్రతిష్టాత్మక టైటిల్స్‌తో పాటు అన్ని ప్రధాన టోర్నీల్లోనూ నొవాక్ జొకోవిచ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, స్పెయిన్ బుల్ రఫల్ నాదల్ లాంటి దిగ్గజ టెన్నిస్ ఆటగాళ్లను వెనక్కు నెట్టి ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుని జొకోవిచ్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.

ఈ ఏడాది జూన్‌లో 22వ ర్యాంకులో ఉన్న జొకోవిచ్‌

ఈ ఏడాది జూన్‌లో 22వ ర్యాంకులో ఉన్న జొకోవిచ్‌

ఈ ఏడాది జూన్‌లో 22వ ర్యాంకులో ఉన్న జొకోవిచ్‌.. అక్టోబరు నెలాఖరుకు వచ్చేసరికి నంబర్‌వన్‌ ర్యాంకులో నిలిచాడు. సోమవారం ప్రకటించబోయే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ వరల్డ్‌ నంబర్‌వన్‌ స్థానానికి చేరుకోనున్నాడు. కడుపు నొప్పితో పారిస్‌ మాస్టర్స్‌ టోర్నీనుంచి రాఫెల్‌ నాదల్‌ అనూహ్యంగా తప్పుకోవడంతో సరిగ్గా రెండేళ్ల తర్వాత నొవాక్‌కు నంబర్‌వన్‌ ఖాయమైంది.

గాయం కారణంగా పారిస్‌ మాస్టర్స్‌ టోర్నీ నుంచి ఔట్

బుధవారం వరకు టెన్నిస్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న రఫెల్ నాదల్ గాయం కారణంగా పారిస్‌ మాస్టర్స్‌ టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఒక్కసారిగా ర్యాంకింగ్‌ పాయింట్లు తగ్గడంతో తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. దీంతో రెండో స్థానంలో ఉన్న జొకోవిచ్‌ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు.

తొలి ఆటగాడిగా జొకోవిచ్‌ అరుదైన ఘనత

తొలి ఆటగాడిగా జొకోవిచ్‌ అరుదైన ఘనత

ఫలితంగా 2000లో మారత్‌ సఫిన్‌ (38వ ర్యాంక్‌) తర్వాత సీజన్‌ ప్రారంభమైనప్పుడు 20 కంటే ఎక్కువ ర్యాంక్‌లో ఉండి నంబర్‌వన్‌గా సీజన్‌ను ముగిస్తున్న తొలి ఆటగాడిగా జొకోవిచ్‌ అరుదైన ఘనత సాధించాడు.

Story first published: Monday, November 12, 2018, 19:43 [IST]
Other articles published on Nov 12, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+