Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండియన్ వెల్స్ నుంచి జొకోవిచ్, ఒసాకా నిష్క్రమణ

Novak Djokovic, Naomi Osaka and Simona Halep all knocked out on day of upsets at Indian Wells

హైదరాబాద్: ఇండియన్‌ వెల్స్‌ ఏటీపీ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకర్లకు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్‌లో జొకోవిచ్‌ (సెర్బియా) మూడో రౌండ్లో, మహిళల ఈవెంట్‌లో నయోమి ఒసాకా (జపాన్‌) ప్రిక్వార్టర్‌‌‌లోనే ఓటమిపాలయ్యారు. మరోవైపు ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌), రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) ప్రిక్వార్టర్‌‌లోకి ప్రవేశించారు.

మూడో రౌండ్లో పురుషుల సింగిల్స్‌ నంబర్‌వన్‌ జకోవిచ్‌ 4-6, 4-6 తేడాతో అన్‌సీడెడ్‌ ఫిలిప్‌ (జర్మనీ) చేతిలో ఓడగా... మరోవైపు మహిళల సింగిల్స్‌ నాలుగో రౌండ్లో నంబర్‌వన్‌ ఒసాకా 3-6, 1-6తో బెలిందా బెన్సిచ్‌ చేతిలో ఓటమిపాలైంది. మహిళల నాలుగోరౌండ్లో బెలిండా బెన్‌కిక్‌ (స్విట్జర్లాండ్‌) 6-3, 6-1తో ఒసాకా (జపాన్‌)ను బోల్తా కొట్టించింది.

మిగతా పురుషుల సింగిల్స్‌‌లో రెండో ర్యాంకర్‌ నాదల్‌ 6-3, 6-1తో స్వాట్జ్‌మన్‌ (అర్జెంటీనా)పై గెలుపొందగా, ఫెదరర్‌ 6-3, 6-4తో తన దేశానికే చెందిన వావ్రింకాపై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో మర్కెటా ఓండ్రువుసోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-2, 3-6, 6-2తో రెండోసీడ్‌ హలెప్‌కు షాకిచ్చింది.

Story first published: Thursday, March 14, 2019, 13:33 [IST]
Other articles published on Mar 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+