న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియన్ ఓపెన్ డ్రాలో జోకోవిచ్‌.. అయినా వీసాపై తొల‌గ‌ని సందిగ్ధం

Novak Djokovic in Australian Open draw amid visa crisis

ఆస్ట్రేలియాలో వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 ఆట‌గాడు నోవాక్‌ జోకోవిచ్ వీసాపై ఇంకా సందిగ్ధం కొన‌సాగుతుంది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం నుంచి ప్రారంభం కాబోయే ఆస్ట్రేలియ‌న్‌ ఓపెన్ డ్రాను టోర్నీ నిర్వాహ‌కులు నేడు వెల్ల‌డించారు. ఈ డ్రాలో సెర్బియా స్టార్‌ జోకోవిచ్‌కు కూడా చోటు క‌ల్పించడం గ‌మనార్హం. డ్రా ప్ర‌కారం జోకోవిచ్ తొలి రౌండ్‌లో త‌న దేశానికే చెందిన అన్‌సీడెడ్ ఆట‌గాడు మియోమిర్ కెక్‌మనోవిచ్‌తో త‌ల‌ప‌డ‌నున్నాడు. అయితే టోర్నీ నిర్వ‌హ‌కులు డ్రాను గంట‌న్న‌ర ఆల‌స్యంగా విడుద‌ల చేశారు. కాగా జోకోవిచ్‌ నేడు ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాడు. సోమ‌వారం లేదా మంగ‌ళ‌వారం త‌న తొలి మ్యాచ్‌ను ఆడ‌నున్నాడు. మ‌రోవైపు జోకోవిచ్ వీసా వివాదం ఆస‌క్తిర‌ మ‌లుపులు తిరుగుతుంది.

త‌న వీసా ర‌ద్దు విష‌యంలో కోర్టులో జోకోవిచ్ విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం మాత్రం జోకోను వ‌దిలిపెట్టేలా క‌నిపించడం లేదు. ఆస్ట్రేలియన్ ఇమ్మిగ్రేషన్ మంత్రి అలెక్స్ హాక్.. జొకోవిచ్ వీసాను రద్దు చేయడానికి ఉన్న అధికారాలన్నింటినీ ఉపయోగిస్తున్నారు. త్వ‌ర‌లోనే జోకోవిచ్ వీసా రెండో సారి ర‌ద్దు చేసే విష‌య‌మై ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం తుది నిర్ణ‌యం తీసుకోనుంది. ఒక వేళ వీసాను ర‌ద్దు చేస్తే జోకోవిచ్ టోర్నీ నుంచి త‌ప్పుకోవాల్సి వ‌స్తుంది. దీనికి తోడు జోకోవిచ్ ఇప్ప‌టికే తన త‌ప్పును ఒప్పుకున్నాడు. గ‌త నెల‌లో క‌రోనా బారిన ప‌డ‌డంతో వ్యాక్సిన్ వేయించుకోలేక పోయాన‌ని తెలిపాడు. అయితే క‌రోనా సోకాక ఐసోలేష‌న్‌లో ఉండ‌కుండా ప‌లు కార్యక్ర‌మాల్లో పాల్గొన్న‌ట్టు జోకోవిచ్ అంగీక‌రించాడు. ఈ మేర‌కు బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాడు. అయితే జోకోవిచ్ టోర్నీలో ఆడేది లేనిది నేడు తెలిసే అవ‌కాశం ఉంది. అత‌డు వ్యాక్సిన్ నుంచి మిన‌హాయింపు కోరుతూ స‌మ‌ర్పించిన ప‌త్రాల‌ను అధికారులు నేడు ప‌రిశీలిస్తున్నారు. ఒక వేళ ఆ ప‌త్రాల్లో అత‌డు త‌ప్పుడు ధృవ ప‌త్రాలు స‌మ‌ర్పించినట్టు తేలితే ఆస్ట్రేలియా చ‌ట్టాల ప్ర‌కారం ఐదేళ్లు జైలు శిక్ష అనుభ‌వించాల్సి ఉంటుంది. అయితే ఇప్ప‌టికే విడుద‌ల చేసిన‌ డ్రాలో జోకోవిచ్ పేరును చేర్చ‌డంతో అతనికి ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం క‌ఠిన శిక్ష‌లు విధించే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. కాకాపోతే గ‌ట్టి వార్నింగ్ ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్నట్టు స‌మాచారం.

నోవాక్ జోకోవిచ్ ఇప్ప‌టివ‌ర‌కు త‌న‌ కెరీర్‌లో 20 గ్రాండ్ స్టామ్‌లు గెలిచాడు. ఈ క్ర‌మంలో టెన్నిస్‌లో అత్య‌ధిక గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన స్విస్ దిగ్గ‌జం రోజ‌ర్ ఫెద‌రర్ స‌ర‌స‌న చేరాడు. అయితే ఇంకొక గ్రాండ్ స్లామ్ నెగ్గితే అత్య‌ధిక గ్రాండ్ స్లామ్‌లు నెగ్గిన ఆట‌గాడిగా టెన్నిస్ చ‌రిత్ర‌లో నిలిచిపోతాడు. ఆ రికార్డును ఆస్ట్రేలియా ఓపెన్‌లోనే అందుకోవాల‌ని జోకోవిచ్ భావిస్తున్నాడు. అంతేకాకుండా త‌న కెరీర్‌లో జోకోవిచ్ అత్య‌ధిక సార్లు ఆస్ట్రేలియా ఓపెన్‌నే గెలిచాడు.

Story first published: Thursday, January 13, 2022, 13:37 [IST]
Other articles published on Jan 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X