For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యుఎస్ ఓపెన్: రఫెల్‌ నాదల్‌ను రఫాడించిన జకోవిచ్

By Nageswara Rao
Novak Djokovic
న్యూయార్క్: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ వేదికపై అనుకున్నదొకటి అయినది ఒకటి. పురుషుల సింగిల్స్‌లలో స్పెయిన్‌కు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ రఫెల్ నాదల్‌ని టాపర్ సీడ్ నోవక్ జకోవిచ్ అవలీలగా 6-2, 6-4, 6-7 (3-7), 6-1సెట్స్‌తో ఓడించడం జరిగింది. జకోవిచ్ ఆడిన ఆటతీరుని చూసినట్లైతే ప్రస్తుతం టెన్నిస్ గేమ్స్‌లో అతను ఎందుకు అంత ఫేవరేట్‌గా మారారో అర్దం అయిపోతుంది. పటిష్టమైన సర్వీసులు, అద్భుతమైన వాలీలతో రఫెల్ నాదల్‌పై విరుచుకుపడి సునాయాశంగా గెలుపొందాడు.

ప్రపంచ నెంబర్ వన్ స్దానం కోసం జరిగిన ఈ ఆటలో మూడవ సెట్లో జరిగిన నాలుగు గంటలు పది నిమిషాలు చాలా ఉత్కంఠ భరితంగా జరిగింది. రఫెల్ నాదల్ టెన్నిస్ రారాజు అనడంలో ఎటువంటి సందేహాం లేదు. అందుకు కారణం నాదల్ సొంతం చేసుకున్న విజయాలు అలాంటివి. ఐతే గత సంవత్సరకాలంగా రఫెల్ నాదల్‌ మొత్తం మీద ఆరు గ్రాండ్ స్లామ్స్(వింబుల్డన్ తో కలిపి) తోపాటు, తన నెంబర్ వన్ ర్యాంకింగ్‌ని కూడా నోవిక్ జకోవిచ్ సొంతం చేసుకున్నాడు.

న్యూయార్క్‌లోని ఆర్తూర్ ఆషే స్టేడియంలో వీరిద్దరి మద్య జరిగిన మ్యాచ్‌లో రఫెల్ నాదల్ ఎంత ప్రయత్నించినప్పటికీ తన ప్రత్యర్ది అయిన నోవిక్ జకోవిచ్‌పై పైచేయి సాధించలేకపోయారు. నోవిక్ జకోవిచ్ ఆడిన ఆటతీరు స్టేడియంలో ఉన్న వారందరిని మంత్ర ముగ్దుల్ని చేసిందంటే నమ్మండి. ఇద్దరు ప్లేయర్స్ కూడా కోర్టులో వర్ణించలేని టెన్నిస్‌ని ఆడడం జరిగింది. నోవిగ్ జకోవిచ్ గెలిచిన ఈ యుఎస్ ఓపెన్ టైటిల్ తన ఖాతాలో మొట్టమొదటి కావడం విశేషం. ఇది మాత్రమే కాకుండా ఈ సంవత్సరం అతను సాధించిన మూడవ గ్రాండ్ స్లామ్. అంతక ముందు జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్‌ని సాధించిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే మహిళల సింగిల్స్ విభాగంలో ఆస్ట్రేలియా క్రీడాకారిణి సమంతా స్టొసుర్ కెరీర్‌లో తొలి గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను సంపాదించుకుంది. ఫైనల్‌లో ఆమె మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్‌ను 6-2, 6-3 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. ఫైనల్ పోరుకు ముందు సెరెనానే విజేతగా అంతా అభివర్ణించారు. సమంతాను ఆమె సునాయాసంగా ఓడిస్తుందని జోస్యం చెప్పారు. కానీ, సెరెనాపై సమంతా సులభంగా నెగ్గింది. ఈ మ్యాచ్ ఏక పక్షంగా ముగియడం విశేషం. కెరీర్‌లో మొట్టమొదటి గ్రాండ్‌శ్లామ్ టైటిల్ అందుకున్న సమంతా, ఆస్ట్రేలియా తరఫున ఈ ఫీట్ సాధించిన రెండో క్రీడాకారిణిగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించింది.

మార్గరెట్ కోర్ట్ తర్వాత యుఎస్ ఓపెన్ టైటిల్‌ను స్వీకరించిన ఆస్ట్రేలియన్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కింది. అంతేగాక, 1980లో ఇవోన్ గూలగాంగ్-కావ్లే ఆస్ట్రేలియా తరఫున చివరి గ్రాండ్‌శ్లామ్ టైటిల్ సాధించింది. ఆమె వింబుల్డన్ టైటిల్‌ను అందుకోగా, మూడు దశాబ్దాల తర్వాత సమంతా మరో గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను ఆస్ట్రేలియా ఖాతాలో చేర్చింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ సమంతా ఆధిపత్యం కొనసాగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పటిష్టమైన సర్వీసులు, అద్భుతమైన వాలీలతో ప్రత్యర్థిపై విరుచుకుపడే సెరెనాకు సమంతా దీటైన సమాధాని ఇచ్చింది. గ్రాండ్‌శ్లామ్ టోర్నీల్లో అపారమైన అనుభవం ఉన్న సెరెనా ఫైనల్‌లో ఏ దశలోనూ సమంతాకు గట్టిపోటీని ఇవ్వలేకపోయింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+