Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తిరుగులేదు: 6వసారి ఆస్ట్రేలియా ఓపెన్ జకోవిచ్‌ సొంతం

మెల్బోర్న్: ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుని తనకు తిరుగులేదని మరోసారి చాటుకున్నాడు. ఆదివారం జరిగిన పరుషుల సింగిల్స్ ఫైనల్‌లో అతను బ్రిటిష్ ఆటగాడు, రెండో సీడ్ ఆండీ ముర్రేను 6-1, 7-5, 7-6 ఆధిక్యంతో ఓడించాడు.

మొదటి సెట్‌ను సులభంగానే గెల్చుకున్న జొకోవిచ్‌కు తర్వాతి రెండు సెట్లలో ముర్రే నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురైంది. ఇరువురు ఆటగాళ్లు నువ్వా నేనా అన్న చందంగా తలపడ్డారు. ఇరువురి పోరాటం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

అయితే, ముర్రేను చివరి రెండు సెట్లలోనూ కట్టడి చేసిన జొకోవిచ్ కెరీర్‌లో 11వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు. వీటిలో ఆరు ఆస్ట్రేలియా ఓపెన్‌లో కైవసం చేసుకున్నవే కావడం విశేషం.

Novak Djokovic beats Andy Murray to win sixth Australian Open title

ఇంత ముందు అతను 2008, 2011, 2012, 2013, 2015 సంవత్సరాల్లో అతను ఇక్కడ విజేతగా నిలిచాడు. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. వింబుల్డన్‌లో మూడు, యుఎస్ ఓపెన్‌లో రెండు టైటిళ్లు కైవసం చేసుకున్న అతనికి మరో గ్రాండ్ శ్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇప్పటి వరకూ టైటిల్ దక్కలేదు.

కాగా, జొకోవిచ్‌కు ఆస్ట్రేలియా ఓపెన్ అచ్చొచ్చిందని, అతను మరోసారి విజేతగా నిలవడం ఖాయమని విశ్లేషకులు చేసిన అంచనాలు నిజమయ్యాయి. జకో తన కెరీర్‌లో 11వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించాడు. 1934లో ఫెడ్ ఫెర్రీ తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను అందుకున్న తొలి బ్రిటిషర్‌గా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించేందుకు ముర్రే చేసిన ప్రయత్నాలను జొకోవిచ్ అడ్డుకున్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+