లాస్ ఏంజెలెస్: ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు, సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ తన ప్రేయసిని పెళ్లి చేసుకోబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు, ప్రేయసి జెలెనా రిస్టిక్‌తో జకోవిచ్‌కు నిశ్చితార్థం జరగనుంది. ఈ విషయాన్ని జకోవిచ్ స్వయంగా తన ట్విట్టర్‌లో వెల్లడించాడు. రిస్టిక్‌తో గత ఎనిమిదేళ్లుగా అతను డేటింగ్ చేస్తున్నాడు.

రిస్టిక్‌ను ముద్దాడుతున్న ఫొటోను అతను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తన ప్రేయసి భార్య కాబోతున్నందుకు అతను సంతోషం వ్యక్తం చేశఆడు. తనకు శుభాకాంక్షలు తెలిపినవారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
జకోవిచ్ వెన్నంటే ఉండే రిస్టిక్ చాలా టెన్నిస్ ప్రేక్షకులకు పరిచయస్థురాలే. అతని మ్యాచులన్నంటికీ ఆమె హాజరవుతూ ఉంటుంది. చారిటీ కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొంటుంది. అతని చారిటేబుల్ ట్రస్టుకు ఆమె డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది.

2012 వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్న తర్వాత జకోవిచ్ తన అగ్రస్థానాన్ని తిరిగి నిలబెట్టుకున్నాడు. అమెరికా ఓపెన్ టోర్నమెంటులో ఈ నెలలో నాదల్ చేతిలో ఓడిపోయాడు. ఆగస్టులో అతను తన ఆత్మకథ పుస్తకాన్ని విడుదల చేశాడు. సర్వ్ టు విన్ పేర ఈ పుస్తకంలో తాను తీసుకునే భోజన పదార్థాల గురించి, శిక్షణ గురించి వివరించాడు.