For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Open 2024: జకోవిచ్ 25వ టైటిల్ సాధిస్తాడా?

ఈ సీజన్‌లో ఆఖరి గ్రాండ్ స్లామ్ యూఎస్ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. ఇవాళ నుంచి ఈ మెగా టోర్నీ‌లో ప్రధాన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ గ్రాండ్ స్లామ్‌లో అందరి కళ్లు సెర్బియా స్టార్, వరల్డ్ నంబర్ 2 నొవాక్ జకోవిచ్‌పైనే ఉన్నాయి. అతను 25వ టైటిల్ సాధిస్తాడా? లేదా? అని ఆసక్తికరంగా మారింది. జకోవిచ్ మరో టైటిల్ సాధిస్తే మార్గరెట్ కోర్ట్ (24)ను దాటి అత్యధికంగా 25 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కుతాడు.

ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి జకోవిచ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఫైనల్‌లో స్పెయిన్ యువ ఆటగాడు అల్కరాస్‌ను ఓడించి పసిడి సాధించడం తనలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అంతేగాక గత యుఎస్ ఓపెన్-2023లో జకోవిచ్‌యే టైటిల్ నెగ్గాడు. ఇవన్నీ అతన్ని ఫేవరేట్‌గా పరిగణించేలా చేస్తున్నాయి. అయితే జకోవిచ్‌ ఈ గ్రాండ్ స్లామ్ గెలవడం అంతఈజీ కాదు.

Novak Djokovic Aims for Record 25th Grand Slam at US Open 2024

అల్కరాస్‌తో పాటు ప్రపంచ నంబర్ వన్ జానెక్ సినర్ నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. ఈ సీజన్‌లో అల్కరాస్ ఫ్రెంచ్, వింబుల్టన్ ఓపెన్‌లు గెలిచాడు. వింబుల్డన్ ఫైనల్‌లో జకోవిచ్‌పై గెలిచాడు. మరోవైపు సినర్ ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచాడు. ఈ నేపథ్యంలో యూఎష్ ఓపెన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, తొలి రౌండ్‌లో జకోవిచ్‌ 138వ ర్యాంకర్‌ అల్బాట్‌ (మోల్డోవా)తో తలపడనున్నాడు.

మరోవైపు ఈ గ్రాండ్ స్లామ్‌లో మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోటీ ఆసక్తికరంగా మారనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కోకో గాఫ్‌తో పాటు స్వైటెక్‌, సబలెంక, రిబకినా, పెగులా, జెంగ్‌ క్విన్‌వెన్‌, క్రెజికోవా ఫేవరేట్లుగా బరిలోకి దిగుతున్నారు. ఇక భారత్ నుంచి మెన్స్ సింగిల్స్‌లో సుమిత్‌ నగాల్‌ పోటీపడుతున్నాడు. అలాగే డబుల్స్‌లో బోపన్న- ఎబ్డెన్, యుకి బాంబ్రి- అల్బానో, శ్రీరామ్‌ బాలాజి- ఆండ్రియోజి బరిలో దిగే అవకాశముంది.

Story first published: Monday, August 26, 2024, 9:21 [IST]
Other articles published on Aug 26, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+