For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జకోవిచ్ అదరహో 430.. టెన్నిస్ దిగ్గజ ఫెదరర్‌ ఆల్‌టైమ్‌ రికార్డ్ బ్రేక్

సెర్బియా స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ మరోసారి అదిరే ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ మూడో రౌండ్‌కు అర్హత సాధించాడు. రెండో రౌండ్‌లో పోర్చుగల్ ప్లేయర్ జైమీ ఫరియాపై విజయం సాధించాడు. 6-1, 6-7 (4), 6-3, 6-2 తేడాతో గెలుపొందాడు. కాగా, జకోవిచ్‌ మూడో రౌండ్‌లో థామస్ మచాక్‌తో తలపడనున్నాడు.

అతడి రికార్డ్ బ్రేక్
నొవాక్ జకోవిచ్ ఈ క్రమంలోనే 'ఓపెన్ ఎరా' ఫ్రొఫెషనల్ టెన్నిస్‌లో ఓ అద్భుతమైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌ 429 మ్యాచులు ఆడి.. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

Novac Djokovic breaks Federer all time record in Melbourne australina open 2025 second round win

ఇప్పుడా రికార్డును జకోవిచ్‌ బ్రేక్ చేశాడు. ఫెదరర్ 429 మ్యాచులు ఆడితే.. జకోవిచ్ తాజాగా 430 మ్యాచ్‌లు కంప్లీట్ చేసుకున్నాడు. కాగా, ఇప్పటివరకు జకోవిచ్ 24 గ్రాండ్‌స్లామ్‌లను టైటిల్ ను ముద్దాడు. ఇందులో 10 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ ఉండగా, 3 ఫ్రెంచ్ ఓపెన్, 7 వింబుల్డెన్, 4 యూఎస్ ఓపెన్‌లు కూడా ఉన్నాయి. ఈ సారి ఎలాగైనా మళ్లీ విజయం సాధించి కెరీర్ లో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు జకోవిచ్.

రెండో రౌండ్ లో గెలవడం సహా ఫెదరర్ అత్యధిక మ్యాచుల రికార్డును బ్రేక్ చేయడంపై సంతోషం వ్యక్తం చేశాడు జకోవిచ్. ''టెన్నిస్‌ ఆడటాన్ని ప్రేమిస్తాను. పోటీని మరింత ఆస్వాదిస్తాను. ఎప్పుడైనా 100 శాతం అత్యుత్తమ ప్రదర్శన చేయడానికే ప్రయత్నిస్తాను.'ఓపెన్ ఎరా' ప్రొఫెషనల్ టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లను సాధించిన ప్లేయర్‌గా ఉండటం నాకు గర్వంగా అనిపిస్తుంది. ఇప్పుడు మరో అద్భుతమైన రికార్డును కూడా సాధించడం ఆనందంగా ఉంది'' అని జకోవిచ్ హర్షం వ్యక్తం చేశాడు.

Story first published: Wednesday, January 15, 2025, 16:21 [IST]
Other articles published on Jan 15, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+