న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మేం పెళ్లి చేసుకుంది భార‌త్‌-పాక్‌ల‌ను క‌ల‌ప‌డానికి కాదు: సానియా సంచలనం

By Nageshwara Rao
Notion that Shoaib Malik and I got married to unite India, Pakistan is not true, says Sania Mirza

హైదరాబాద్: భార‌త్, పాకిస్తాన్‌ల‌ను క‌ల‌ప‌డం కోస‌మే తాను షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్నామ‌ని చాలామంది అపోహ ప‌డుతుంటారని కానీ, అందులో ఎంత మాత్రం నిజం లేదని భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పేర్కొంది. సానియా మీర్జా, పాక్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్ త్వ‌ర‌లో త‌ల్లిదండ్రులు కాబోతున్నారు.

సానియా మిర్జా ప్ర‌స్తుతం ఎనిమిది నెల‌ల గ‌ర్భ‌వ‌తి. త్వ‌ర‌లోనే ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుంది. తన సోదరి ఆనమ్‌తో టెన్నిస్ ఆడుతోన్న వీడియోని ఇటీవలే సానియా మిర్జా ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సానియా మిర్జా హిందుస్తాన్ టైమ్స్ ప‌త్రిక‌ కోసం ఫోటోషూట్‌లో పాల్గొంది.

తల్లి కాబోతున్న సానియా టెన్నిస్‌ను వీడలేకపోతుంది (వీడియో)తల్లి కాబోతున్న సానియా టెన్నిస్‌ను వీడలేకపోతుంది (వీడియో)

ఈ సందర్భంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు విష‌యాల గురించి సానియా మిర్జా స్పందించింది. ''భార‌త్, పాకిస్తాన్‌ల‌ను క‌ల‌ప‌డం కోస‌మే మేం పెళ్లి చేసుకున్నామ‌ని చాలామంది అపోహ ప‌డుతుంటారు. కానీ, అది నిజం కాదు. నా భ‌ర్త త‌ర‌ఫు బంధువుల‌ను క‌ల‌వ‌డానికి నేను సంవ‌త్స‌రానికి ఓ సారి పాకిస్తాన్ వెళ్తాను" అని తెలిపింది.

"అక్క‌డ నాకు ల‌భించే ప్రేమ, గౌర‌వం అపారం. ఆ దేశ ప్ర‌జ‌లంద‌రూ న‌న్ను వ‌దిన‌గా భావిస్తారు. నా భ‌ర్త‌పై ఉన్న అభిమానం వ‌ల్ల నాపై ప్రేమ‌ను కురిపిస్తారు. షోయ‌బ్ మాలిక్ భార‌త్ వ‌చ్చినపుడు ఇక్క‌డి ప్ర‌జ‌లు కూడా అదే స్థాయిలో ప్రేమ‌ను చూపిస్తారు'' అని సానియా వెల్లడించింది.

క్రికెట్.. టెన్నిస్ కాదు నా బిడ్డ డాక్టర్ కావాలనుకుంటున్నా: సానియాక్రికెట్.. టెన్నిస్ కాదు నా బిడ్డ డాక్టర్ కావాలనుకుంటున్నా: సానియా

తన బిడ్డ గొప్ప డాక్టర్‌ కావాలని కోరుకుంటున్నట్టు సానియా మిర్జా వెల్లడించింది. ఇక, తన బిడ్డ జాతీయత గురించి అస్సలు ఆలోచించడం లేదన్న సానియా.. ఒకవేళ ఆ సమస్య తలెత్తితే మూడో దేశాన్ని ఎంచుకుంటానని చెప్పడం గమనార్హం. కాగా భారత్-పాకిస్థాన్ అంటేనే చాలామంది వైరం అనుకుంటున్నారని... కానీ ఆ భావన సరికాదని సానియా మీర్జా తెలిపింది.

కాగా, తమకు ఎవరు పుట్టినా ఓకేనన్న సానియా.. భర్త షోయబ్‌ మాలిక్‌ మాత్రం ఆడపిల్లనే కావాలనుకుంటున్నట్టు తెలిపింది. అక్టోబర్‌లో సానియా బిడ్డకు జన్మనివ్వనుంది. గర్భవతిగా ఉన్నా తాను రోజూ నాలుగైదు కిలోమీటర్లు నడుస్తున్నానని చెప్పింది.

''గర్భం దాలిస్తే కాలుతీసి కాలు వేయకూడదని కొందరు అనుకుంటారు. ఈ ఆలోచన సరికాదు. నేను వారానికి నాలుగుసార్లు యోగా చేస్తాను. మా అమ్మ మాత్రం ఆందోళన చెందుతుంటుంది. ఇప్పుడెందుకు వ్యాయామం అంటుంది. ఆమెను ఎలాగోలా ఒప్పిస్తున్నా. రోజుకి నాలుగైదు కిలోమీటర్లు నడుస్తాను. టెన్నిస్‌ మాత్రం ఆడడం లేదు. ఇంట్లోనే టెన్నిస్‌ కోర్టు ఉంది. నేను కోర్టులోకి వెళితే మా అమ్మ చంపేస్తుంది (నవ్వుతూ)'' అని సానియా మీర్జా చెప్పింది.

Story first published: Tuesday, August 14, 2018, 16:55 [IST]
Other articles published on Aug 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X