యూఎస్‌ ఓపెన్‌లో ఆడుతా: జొకోవిచ్‌

బెల్‌గ్రేడ్‌: జూన్ చివరలో కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్‌ జొకోవిచ్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. యూఎస్ ఓపెన్‌ గ్రాండ్‌ స్లామ్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. కొన్ని రోజుల క్రితం తాను యూఎస్‌ ఓపెన్‌ ఆడలేమోనని అనుమానం వ్యక్తం చేసిన జొకోవిచ్‌.. తాజాగా ప్రతిష్టాత్మక గ్రాండ్‌ స్లామ్‌కు సిద్ధం అంటూ స్పష్టం చేశాడు.

'నేను యూఎస్‌ ఓపెన్‌ ఆడటానికి చాలా సంతోషంగా ఉన్నా. వెస్ట్రన్‌, సౌత్రన్‌ ఓపెన్‌లతో పాటు యూఎస్‌ ఓపెన్‌లో కూడా పాల్గొనబోతున్నా. ఇది అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు. చాలా అంశాలు పరిశీలించిన తర్వాత ఎంతో కష్టంగా తీసుకున్న నిర్ణయం​. యూఎస్‌ ఓపెన్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం​. ఈసారి ప్రోటోకాల్స్‌ భిన్నంగానే ఉండబోతున్నాయి. ఆటగాళ్ల రక్షణే లక్ష్యంగా కొన్ని మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని పాటిస్తూ యూఎస్‌ ఓపెన్‌ ఆడతా' అని జాకో తెలిపాడు.

'నాకు అన్ని చెకప్‌లు పూర్తయ్యాయి. నేను పూర్తిగా కోలుకున్నా. ఇక నా అత్యుత్తమ టెన్నిస్‌ ఆడటానికి సిద్ధంగా ఉ‍న్నా. కొత్త వాతావరణంలో ఆడటానికి నన్ను నేను పూర్తిగా మార్చుకుంటున్నా' అని జొకోవిచ్‌ తెలిపాడు. జొకోవిచ్‌ యూఎస్‌ ఓపెన్‌కు ఓకే చెప్పిన నేపథ్యంలో స్పెయిన్ బుల్ రఫెల్‌ నాదల్‌ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడేమో? చూడాలి. ఈనెల 31 నుంచి యూఎస్‌ ఓపెన్‌ ఆరంభం కానుంది. బయో సెక్యూర్‌ వాతావరణంలో యూఎస్‌ ఓపెన్‌ జరుగనుంది.

కరోనా వైరస్ మహమ్మారితో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లో పలువురు అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారులు అనవసరమైన రిస్క్‌ తీసుకోకూడదనే కొంతమంది అగ్రశ్రేణి క్రీడాకారులు యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్నారు. వీరిలో స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ కూడా ఉన్నాడు. మహిళల టెన్నిస్‌ నెంబర్‌వన్‌, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ఆష్లే బార్టీ ఆడనని ప్రకటించారు. అయితే సెరెనా విలియమ్స్ మాత్రం యూఎస్‌ ఓపెన్‌కు సిద్ధమని తెలిపారు. స్టార్ ప్లేయర్లు యూఎస్‌ ఓపెన్‌ ఆడకపోతే కళ తప్పుతుందనే భావించిన గ్రాండ్‌ స్లామ్‌ యాజమాన్యానికి జొకోవిచ్‌ ఆడతానంటూ ప్రకటించడం ఊరట కలిగించే అంశం.

నొవాక్‌ జొకోవిచ్‌ ఆధ్వర్యంలో గత జూన్ నెలలో అడ్రియా టూర్‌ ఎగ్జిబిషన్‌ టోర్నీ జరిగింది. సెర్బియా రాజధానిలో తొలి దశ టూర్ ముగియగా.. ఆ తర్వాత రెండో దశ పర్యటన జదార్‌లో జరిగింది. సెర్బియా అంచె పోటీలు ముగిశాక.. క్రొయేషియాలో రెండో అంచె పోటీలు నిర్వహిస్తుండగా ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కోవిడ్‌ బారిన పడ్డారు. దీంతో ఫైనల్‌ మ్యాచ్‌ను రద్దు చేశారు. అప్పటికే ముగ్గురు టాప్ ప్లేయర్లు గ్రిగోర్ దిమిత్రోవ్‌ (బల్గేరియా), బోర్నా కోరిచ్‌ (క్రొయేషియా), విక్టొర్‌ ట్రయోకీ (సెర్బియా)లకు కరోనా నెగటివ్ అని తేలింది. ఆ తర్వాత అడ్రియా టూర్ నిర్వాహకుడు, ఆటగాడు జొకోవిచ్‌కు వైరస్ సోకింది. ఆపై 10 రోజులు వైద్యుల సమక్షంలో కోలుకున్నాడు.

బ‌యోసెక్యూర్ రూల్ బ్రేక్.. బామ్మతో దొరికిపోయిన పాక్ క్రికెట‌ర్‌!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, August 13, 2020, 22:11 [IST]
Other articles published on Aug 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X