న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Australian Open 2021: మహిళల సింగిల్స్‌ ఫైనల్స్ నేడే.. గెలిచేది ఎవరు?

Naomi Osaka vs Jennifer Brady: Australian Open 2021 Womens Singles final preview

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2021 మహిళల సింగిల్స్‌ విజేత ఎవరో మరికొద్ది గంటల్లో తేలనుంది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఫైనల్లో మూడో సీడ్, జపాన్‌ స్టార్‌ నవోమి ఒసాకాతో 22వ సీడ్‌ జెన్నిఫర్‌ బ్రాడీ (అమెరికా) తలపడుతుంది. ప్రపంచ మూడో ర్యాంకర్‌ ఒసాకా స్థాయికి తగ్గ ఆటతీరును కనబరిస్తే ఫైనల్‌ను లాంఛనంగా ముగించేస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 2019లో ఇక్కడ టైటిల్‌ గెలిచిన ఒసాకా గతేడాది యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచింది.

ఇప్పటికే మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన అనుభవం నవోమి ఒసాకాది.. అసాధారణ ఆటతో ఫైనల్‌ చేరి టైటిల్‌ దిశగా దూసుకెళ్తున్న ఉత్సాహం జెన్నిఫర్‌ బ్రాడీది. ఫైనల్లో అందరి ఫేవరెట్‌ ఒసాకానే. సెమీఫైనల్లో దిగ్గజ క్రీడాకారిణి సెరెనాను ఓడించిన ఆమె రెండోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను గెలవాలని పట్టుదలగా ఉంది. అయితే 22వ సీడ్‌ బ్రాడీ నుంచి గట్టి పోటీ తప్పకపోవచ్చు. గతేడాది యుఎస్‌ ఓపెన్‌ సెమీస్‌లో ఒసాకాకు ఆమె గట్టిపోటీ ఇచ్చింది. మూడు సెట్ల పాటు పోరాడి ఓడింది. ఈసారి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.

రష్యా స్టార్‌ ప్లేయర్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్‌లో గ్రీకు ఆటగాడు స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ను చిత్తుచేసి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ టైటిల్‌ సాధించాలన్న కలకు చేరువయ్యాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన పోరులో మెద్వెదెవ్‌ 6-4, 6-2, 7-5 తేడాతో సిట్సిపాస్‌ను వరుస సెట్లలో చిత్తుచేశాడు. క్వార్టర్స్‌లో స్పెయిన్‌ బుల్‌ నాదల్‌ను ఓడించిన స్టెఫనోస్‌ను 2 గంటల 9 నిమిషాల్లో మట్టికరిపించాడు.

టైటిల్‌ పోరులో ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ను మెద్వెదెవ్‌ ఆదివారం ఢీకొననున్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరిన ఎనిమిదిసార్లు టైటిల్‌ ఎగరేసుకుపోయిన 100 శాతం రికార్డు జొకోది. అయితే గతేడాది ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో నొవాక్‌పై మ్యాచ్‌ను మెద్వెదెవ్‌ గెలిచాడు. అలాగే వరుసగా 20 మ్యాచ్‌ల విజయాలతో ఫుల్‌జోష్‌ మీద ఉన్నాడు. మరోవైపు టోర్నీ ఆరంభంలో గాయంతో కాస్త ఇబ్బంది పడిన నొవాక్‌.. సెమీస్‌లో పూర్తిఫిట్‌గా కనిపించాడు. దూకుడైన ఆటతో అదరగొట్టాడు. మరి జొకోవిచ్‌ను దాటి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలన్న కలను మెద్వెదెవ్‌ నెరవేర్చుకుంటాడా చూడాలి.

IPL 2021 Auction: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రధాన సమస్య అదే.. పోటీలో నిలవాలంటే?: గంభీర్‌IPL 2021 Auction: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రధాన సమస్య అదే.. పోటీలో నిలవాలంటే?: గంభీర్‌

Story first published: Saturday, February 20, 2021, 11:31 [IST]
Other articles published on Feb 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X