Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ట్విట్టర్‌లో ప్రకటన: కోచ్‌తో తెగదెంపులు చేసుకున్న నవోమి ఒసాకా

 Naomi Osaka’s split with Sascha Bajin a sign of the times and her steeliness

హైదరాబాద్: ప్రస్తుతం ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న జపాన్‌కు చెందిన నవోమి ఒసాకా అనూహ్య నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండు గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ సాధించేలా తనను తీర్చిదిద్దిన కోచ్‌ సషా బాజిన్‌తో (జర్మనీ) తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు తన ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. "అందరికీ హాయ్‌. ఇక నుంచి కోచ్‌ సషా బాజిన్‌తో కలసి పనిచేయడంలేదు. ఇన్నాళ్లూ ఆయన అందించిన తోడ్పాటుకు ధన్యవాదాలు. భవిష్యత్‌లో ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నాను" అని 21 ఏళ్ల ఒసాకా ట్వీట్ చేసింది.

అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌తో పాటు కరోలినా వోజ్నియాకి (డెన్మార్క్‌), అజరెంకా (బెలారస్‌)కు హిట్టింగ్‌ పార్ట్‌నర్‌గా వ్యవహరించిన బాజిన్‌ 2018 ఆరంభంలో ఒసాకాకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. బాజిన్‌ శిక్షణలోనే ఒసాకా ఓ అద్భుతమైన స్టార్ ప్లేయర్‌గా రూపుదిద్దుకుంది.

2018లో టెన్నిస్‌ స్టార్ సెరెనా విలియమ్స్‌ను ఓడించి యూఎస్‌ గ్రాండ్‌ స్లామ్ గెలిచిన ఒసాకా(21) అదే ఫామ్‌ను 2019లో కూడా కొనసాగించింది. ఈ ఏడాది ఆరంభ టోర్నీ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో చెక్‌ క్రీడాకారిణి పెట్రా క్విటోవాపై 7-6(2), 5-7, 6-4 తేడాతో విజయం సాధించడంతో ఆసియా నుంచి నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను దక్కించుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.

ఇక, సషా బాజిన్‌ తన ట్విట్టర్‌లో "ధన్యవాదాలు నవోమి. నీతో కలిసి పని చేసిన కాలం అద్భుతంగా సాగింది. దీంట్లో నన్నూ భాగం చేసినందుకు కృతజ్ఞతలు" అని ట్విటర్‌లో పేర్కొన్నాడు.

Story first published: Wednesday, February 13, 2019, 13:22 [IST]
Other articles published on Feb 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+