న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓటమి తప్పించుకున్న ఒసాకా.. జకోవిచ్‌, సెరెనా ముందంజ

Naomi Osaka hangs tough at French Open; Williams, Djokovic win

ఫ్రెంచ్‌ ఓపెన్లో టాప్‌సీడ్‌ నొజొమి ఒసాకా (జపాన్‌) కొద్దిలో ఓటమి తప్పించుకుంది. తొలి రౌండ్లో మూడు సెట్లు పోరాడి గెలిచిన ఒసాకా.. రెండో రౌండ్లో ఓటమి అంచు నుంచి బయటపడింది. గురువారం హోరాహోరీ సాగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో ఒసాకా 4-6, 7-5, 6-3తో విక్టోరియా అజరెంక (బెలారస్‌)పై చెమటోడ్చి గెలిచింది. తొలి సెట్లో ఓడి.. రెండో సెట్లోనూ 2-4తో వెనకబడిన ఒసాకా.. అసాధారణంగా పుంజుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు గంటల 50 నిమిషాలు ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

Naomi Osaka hangs tough at French Open; Williams, Djokovic win

అమెరికా తార సెరెనా విలియమ్స్‌ మూడో రౌండ్‌ చేరింది. సెరెనా 6-3, 6-2తో నారా (జపాన్‌)ను ఓడించింది. హలెప్‌ (రొమేనియా), బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌), సమంత స్టోసర్‌ (ఆస్ట్రేలియా), బార్టీ (ఆస్ట్రేలియా) మూడో రౌండ్‌ చేరారు. ఇక పురుషుల విభాగంలో టాప్‌సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ మూడో రౌండ్లో ప్రవేశించాడు. రెండో రౌండ్లో జకో 6-1, 6-4, 6-3తో లాక్సొనెన్‌ (స్విట్జర్లాండ్‌)ను ఓడించాడు. డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా ) 6-3, 6-7 (6-8), 6-3, 7-5తో బబ్లిక్‌ (కజకిస్థాన్‌)పై చెమటోచాడు.

మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌) 6-3, 6-4, 6-4తో మానారియో (ఫ్రాన్స్‌)ను ఓడించాడు. అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), బోర్నా కొరిచ్‌ (క్రొయేషియా), బటిస్టా అగట్‌ (స్పెయిన్‌) కూడా మూడో రౌండ్‌ చేరారు. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దివిజ్‌ శరణ్‌-అయామా (జపాన్‌) తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. దివిజ్‌ జోడీ 3-6, 6-2, 7-10తో కిచెనొక్‌ (ఉక్రెయిన్‌)-గోంజెలజ్‌ (మెక్సికో) చేతిలో పరాజయం పాలైంది.

Story first published: Friday, May 31, 2019, 7:41 [IST]
Other articles published on May 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X