న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Australian Open 2021: సెరీనా విలియ‌మ్స్‌కు మ‌ళ్లీ నిరాశే.. ఫైన‌ల్లోకి న‌వోమి ఒసాకా!!

Naomi Osaka beats Serena Williams to advance to Australian Open final

మెల్‌బోర్న్‌: అమెరికా స్టార్ ప్లేయర్ సెరీనా విలియ‌మ్స్‌కు మ‌ళ్లీ చుక్కెదురైంది. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ 2021 సెమీస్‌లో సెరీనా ఓట‌మి పాలైంది. జ‌పాన్‌కు చెందిన యువ క్రీడాకారిణి న‌వోమి ఒసాకా చేతిలో సెరీనా ఘోర పరాజ‌యం చెందింది. దీంతో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై ఉన్న సెరీనా ఆశ‌లు గ‌ల్లంతు అయ్యాయి. 2017లో మెల్బోర్న్ పార్కులో సెరెనా తన 23వ ట్రోఫీని గెలుచుకుంది. ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ మార్గరెట్‌ కోర్ట్‌ (24 టైటిళ్లు) అత్యధిక టైటిళ్ల గెలుచుకున్న ప్లేయర్‌గా రికార్డుల్లో ఉంది.

గురువారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లో సెరెనా విలియ‌మ్స్ 6-3, 6-4తో న‌వోమి ఒసాకా చేతిలో పరాజ‌యం పాలైంది. దీంతో ఒసాకా ఫైనల్లో అడుగుపెట్టింది. మూడు సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన ఒసాకా ఈ మ్యాచ్‌లో సెరీనాకు ఎటువంటి ఛాన్స్ ఇవ్వ‌లేదు. రెండు సెట్లలో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఒసాకా వ‌రుస‌గా 20వ మ్యాచ్‌ను గెలుచుకున్న‌ది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు గ్రాండ్‌స్లామ్ ఫైన‌ల్లో ఒసాకా ఓట‌మి చ‌విచూడ‌లేదు. శ‌నివారం జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌లో జెన్నిఫ‌ర్ బ్రాడీ లేదా క‌రోలినా ముచోవ్‌తో పోటీప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

ఓపెన్ సెమీఫైన‌ల్లో ఓసాకా చేతిలో ఓడిన సెరీనా ఆ బాధ‌ను త‌ట్టుకోలేక‌పోయింది. పోస్ట్ మ్యాచ్ కాన్ఫ‌రెన్స్ స‌మ‌యంలో మీడియాతో మాట్లాడుతూ ఓ ద‌శ‌లో క‌న్నీరుమున్నీరైంది. అన‌వ‌స‌ర త‌ప్పిదాలే త‌న ఓట‌మి కార‌ణ‌మంటూ విల‌పించింది. మ‌రెందుకు అలా త‌ప్పిదాలు చేశారంటూ జ‌ర్న‌లిస్టులు ప్ర‌శ్న‌వేయ‌గా.. సెరీనా భావోద్వేగానికి లోనైంది. ఎందుకో తెలియ‌దు.. నా వ‌ల్ల కాలేదంటూ బాధ దిగ‌మింగుకున్న‌ది. ఇదే మీ చివ‌రి ఆస్ట్రేలియ‌న్ ఓపెనా అంటూ మ‌రో ప్ర‌శ్న వేశారు. ఆ స‌మ‌యంలో స‌మాధానం ఇవ్వ‌లేక‌పోయిన సెరీనా.. కన్నీళ్లు కారుస్తూ మీడియా స‌మావేశం నుంచి వెళ్లిపోయింది.

ఒసాకా, సెరీనాలు ఇద్ద‌రూ ప‌వ‌ర్ గేమ్ ఆడారు. అయితే ఆ పోరులో ఒసాకా కొంత ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచింది. విలియ‌మ్స్ 12 విన్నింగ్ షాట్లు కొట్ట‌గా.. ఒసాకా 20 విన్న‌ర్స్ కొట్టింది. టోర్నీ మొత్తం మంచి హిట్టింగ్ చేసిన సెరీనా.. సెమీస్‌లో మాత్రం త‌డ‌బ‌డింది. ఒసాకా ప‌వ‌ర్ గేమ్‌కు త‌లొగ్గిన‌ట్లు క‌నిపించింది. 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన సెరీనా.. మార్గ‌రేట్ కోర్టు రికార్డును అందుకునేందుకు మ‌రో అడుగు దూరంలో ఉన్న‌ది. కూతురుకు జ‌న్మ‌నిచ్చిన త‌ర్వాత మ‌ళ్లీ రాకెట్ ప‌ట్టిన సెరీనా.. నాలుగు గ్రాండ్‌స్లామ్ ఫైన‌ల్లో ఓట‌మిపాలైంది.

India vs England: అశ్విన్ భాయ్.. నేను చివరి వరకు క్రీజులోనే ఉంటా! నువ్ సెంచరీ చేయ్!India vs England: అశ్విన్ భాయ్.. నేను చివరి వరకు క్రీజులోనే ఉంటా! నువ్ సెంచరీ చేయ్!

Story first published: Thursday, February 18, 2021, 13:51 [IST]
Other articles published on Feb 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X