Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యుఎస్ ఓపెన్ ఫైనల్: నాదల్ Vs ఆండర్సన్

హైదరాబాద్: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్‌ టోర్నీలో స్పెయిన్ బుల్‌ రఫెల్‌ నాదల్‌ ఫైనల్‌‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీ ఫైనల్‌లో అర్జెంటీనా ఆటగాడు జువాన్ మార్టిన్‌ డెల్‌ పొట్రోపై అద్భుత విజయాన్ని నమోదు చేశాడు.

శుక్రవారం రాత్రి జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో డెల్‌ పొట్రోపై 4-6, 6-0, 6-3, 6-2 తేడాతో నాదల్ ఘన విజయం సాధించాడు. తాజా విజయంతో నాదల్ తన కెరీర్‌లో 23వ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టాడు. మరోవైపు 2013 తర్వాత యుఎస్ ఓపెన్ ఫైనల్‌కు నాదల్ చేరుకోవడం ఇదే తొలిసారి.

Nadal to face Anderson in US Open final

ఇదిలా ఉంటే సెమీస్‌లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌ను డెల్ పోట్రో ఓడించిన సంగతి తెలిసిందే. ఇక, మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా స్టార్ కెవిన్ అండర్సన్, పబ్లో బుస్తాను ఓడించి ఫైనల్‌‌కు చేరాడు. దీంతో సెప్టెంబర్ 11న (సోమవారం) పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాదల్, ఆండర్సన్‌లు తలపడనున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+