హైదరాబాద్: స్పెయిన్ బుల్ రఫెల్ నాదర్ ఈ ఏడాదిని నెంబర్ వన్ ర్యాంకులో ముగించనున్నాడు. పారిస్ మాస్టర్స్ రెండో రౌండ్‌లో బుధవారం 7-5, 6-3తో చుంగ్ హ్యూన్ (దక్షిణకొరియా)ను ఓడించాడు.
దీంతో ఇక ఈ ఏడాది చివరివరకు ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నాదల్ అగ్రస్ధానంతో ముగించనున్నాడు. ఇలా నంబర్ వన్‌తో ఏడాదిని ముగించడం నాదల్‌కు నాలుగోసారి. అంతేకాదు టాప్ ర్యాంక్‌తో సీజన్ ముగించిన పెద్ద వయస్కుడిగా నాదల్ (31) చరిత్ర సృష్టించాడు.

ఇంతకుముందు 2008, 2010, 2013లో కూడా నాదల్ నెంబర్ వన్‌గానే ముగించాడు. 2017 అటు రోజర్ ఫెదరర్‌కు, ఇటు రఫెల్ నాదల్‌కు ఎన్నో తీపి గుర్తులను మగిల్చాయి. ఈ ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌ని కొనసాగించారు. అయితే ఫారిస్ మాస్టర్స్ నుంచి రఫెల్ తప్పుకోగా, నాదల్‌కు నెంబర్ వన్‌గా ముగించడానికి ఒక్క విజయం కావాలి.