Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్రెంచ్ ఓపెన్ రఫెల్ నాదల్ సొంతం, ఓటమి తప్పని రోజర్ ఫెదరర్

Rafael Nadal
పారిస్: రఫెల్ నాదల్ తన సత్తా మరోసారి చాటాడు. ప్రపంచ నెంబర్‌వన్‌ రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)రికార్డు స్థాయిలో ఆరో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ఫేవరెట్‌ మైదానంలో ఎప్పటిలా ఆధిపత్యాన్ని కొనసాగించిన నాదల్‌ ఆదివారం దాదాపు నాలుగు గంటలపాటు హోరాహోరీగా సాగిన ఫైనల్లో 7-5, 7-6 (7-3), 5-7, 6-1తో రోజర్ ఫెదరర్‌ను మట్టికరిపించాడు. ఆరంభంలో పైచేయి సాధించిన ఫెదరర్‌ క్రమంగా నాదల్‌ దూకుడుకు తలవంచాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో నాదల్‌ చేతిలో ఓడడం ఫెదరర్‌కిది నాలుగోసారి. కెరీర్‌లో పదో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ చేజిక్కించుకున్న నాదల్‌ నెంబర్‌వన్‌ స్థానాన్ని మరికొంత కాలం పదిలపరుచుకున్నాడు.

ఆరంభంలో ఫెదరర్‌ను చూస్తే ఈసారి భిన్నమైన ఫలితాన్ని రాబట్టేలా కనిపించాడు. దూకుడైన ఆటతో నాదల్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఏస్‌తో మ్యాచ్‌ను మొదలు పెట్టిన ఫెదరర్‌ చక్కని బ్యాక్‌ హ్యాండ్‌, ఫోర్‌ హ్యాండ్‌ షాట్లతో అదరగొట్టాడు. రెండో గేమ్‌లో నాదల్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి పైచేయి సాధించాడు. సర్వీస్‌ను నిలబెట్టుకుని 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. కొన్ని నాదల్‌ ఫోర్‌హ్యాండ్‌ షాట్లు గురి తప్పాయి.

ఎనిమిదో గేములో సెట్‌పాయింట్‌ కాచుకున్న నాదల్‌, ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్నాడు. బలమైన ఫోర్‌ హ్యాండ్‌ షాట్లతో ఫెదరర్‌ను పరుగులు పెట్టించాడు. తొలి సర్వ్‌లో ఫెదరర్‌ తడబడ్డాడు. నాదల్‌.. వరుసగా 9, 11వ గేముల్లో ఫెదరర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి, 12వ గేమ్‌లో సర్వీసును నిలబెట్టుకుని సెట్‌ను చేజిక్కించుకున్నాడు. అదే జోరును రెండో సెట్లో కొనసాగించిన నాదల్‌.. తొలి గేమ్‌లోనే బ్రేక్‌ సాధించి ఫెదరర్‌కు షాకిచ్చాడు. ఎనిమిదో గేమ్‌ నుంచి మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. ఆ గేమ్‌లో బ్రేక్‌ సాధించిన ఫెదరర్‌ 4-4తో సమం చేశాడు. ఐతే ఫెదరర్‌ వెంటనే సర్వీసు కోల్పోయాడు. కానీ వెంటనే బ్రేక్‌ సాధించి 5-5తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ సర్వీసు నిలబెట్టుకోవడం సెట్‌ టైబ్రేక్‌కు దారితీసింది. టైబ్రేక్‌ ఆరంభంలో 4-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన నాదల్‌ చివరికి 7-3తో గెలిచాడు. తొలి రెండు సెట్లు కోల్పోయిన ఫెదరర్‌ మూడో సెట్‌ ఆరో గేమ్‌లో సర్వీసు కోల్పోయాడు. దీంతో మ్యాచ్‌ మూడో సెట్‌తోనే ముగుస్తుందనపించింది. కానీ పుంజుకున్న ఫెదరర్‌ 7, 11వ గేముల్లో బ్రేక్‌ సాధించి, సర్వీసులు నిలబెట్టుకుని సెట్‌ను చేజిక్కించుకున్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+