Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముచ్చటగా మూడోసారి: యుఎస్‌ ఓపెన్‌ విజేత నాదల్‌

హైదరాబాద్: యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌ విజేతగా స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్‌ నాదల్‌ నిలిచాడు. న్యూయార్క్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్‌ అండర్సన్‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు. తద్వారా నాదల్ తన కెరీర్‌లో 16వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాడు.

ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో నాదల్‌ విజృంభించి ఆడి వరుస సెట్లలో విజయం సాధించాడు. 6-3, 6-3, 6-4 తేడాతో కెవిన్‌ అండర్సన్‌ను చిత్తుగా ఓడించాడు. నాదల్ యుఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గడం ఇది మూడోసారి. అంతకుముందు 2010, 2013లో నాదల్‌ యుఎస్‌ ఓపెన్‌ టైటిల్స్‌ సొంతం చేసుకున్నాడు.

 Nadal beats Anderson for third US Open title

విజేతగా నిలిచిన నాదల్‌కు 37 లక్షల డాలర్లు (రూ. 23 కోట్ల 61 లక్షలు) రన్నరప్‌ అండర్సన్‌కు 18 లక్షల 25 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఇక అండర్సన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కి రావడం ఇదే తొలిసారి. గత 52 ఏళ్లలో యుఎస్‌ ఓపెన్‌ పైనల్‌కు చేరిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా ఆండర్సన్ అరుదైన గుర్తింపు పొందాడు.

ఈ ఏడాది నాదల్‌ మూడు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఫైనల్‌కు చేరాడు. ఈ ఏడాదిలో రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలవడం పట్ల నాదల్‌ సంతోషం వ్యక్తం చేశాడు. 'ఈ ఏడాదిలో ఇలా జరగడం నమ్మశక్యంగా లేదు. వ్యక్తిగత సమస్యలు, గాయాలు కారణంగా కొన్నేళ్లుగా బాగా ఆడలేకపోయాను. ఈ సీజన్‌లో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాను' అని మ్యాచ్‌ అనంతరం నాదల్‌ అన్నాడు.

తాజాగా విజయంతో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్ సాధించిన వారిలో రోజర్‌ ఫెదరర్‌ 19 టైటిల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రఫెల్ నాదల్ ఖాతాలో 16 టైటిల్స్‌ ఉన్నాయి. ఇక, పీట్‌ సంప్రాస్‌(14), జొకొవిక్‌(12), ఎమర్సన్‌(12), బొర్గ్‌(11), లావర్‌(11), టిల్డన్‌(10) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

స్పెయిన్‌కు చెందిన రఫెల్ నాదల్ అత్యధికంగా పది ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్స్‌ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మూడు యుఎస్‌ ఓపెన్‌, రెండు వింబుల్డన్‌ టైటిల్స్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం ఒక్కసారి మాత్రమే ఆస్ట్రేలియా ఓపెన్‌ విజేతగా నాదల్ నిలవడం విశేషం.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+