హల్‌చల్: సానియా మీర్జాతో కల్వకుంట్ల కవిత సెల్ఫీ
హైదరాబాద్: వింబుల్డన్ విజేత, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాతో కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత హల్ చల్ చేశారు. డబుల్స్‌లో నెంబర్ వన్ ర్యాంకును సాధించిన సానియా మీర్జాను బుధవారం 'డబ్ల్యూటీఏ ఫ్యూచర్ స్టార్స్' సత్కరించింది.

ఈ కార్యక్రమానికి కవితతో పాటు టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. మహిళల టెన్నిస్‌ను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోందని వెల్లడించారు. వింబుల్డన్‌ను సానియా గెలవడం తెలంగాణకే కాకుండా, దేశానికి కూడా గర్వకారణమని వ్యాఖ్యానించారు.

నెంబర్ వన్ ర్యాంక్ సాధించడానికి ఎంతో కష్టపడ్డానని సానియా చెప్పింది. తాను సాధించిన ఈ ఘనత ద్వారా ఏదైనా సాధించవచ్చని భారత అమ్మాయిలు నమ్ముతారని భావిస్తున్నట్లు సానియా మీర్జా తెలిపింది. సానియా, నవ్రతిలోవా కూడా సందడి చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications