న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోసపూరితమే: క్షమాపణలు చెప్పిన మార్టినా నవ్రతిలోవా

Martina Navratilova sorry for cheat comment and only wants fairness after transgender athlete row

హైదరాబాద్: ట్రాన్స్‌జెండర్‌ అథ్లెట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా క్షమాపణలు కోరింది. ట్రాన్స్‌జెండర్స్‌గా మారిన అథ్లెట్లు మహిళల స్పోర్ట్స్‌లో పోటీ పడాలనుకోవడం మోసపూరితమేనని ఇటీవల ఓ పత్రికకు రాసిన కాలమ్‌లో నవ్రతిలోవా పేర్కొంది.

<strong>ఐపీఎల్‌లో ఐసీసీ జోక్యం: స్పందించిన సీఈఓ రిచర్డ్‌సన్‌</strong>ఐపీఎల్‌లో ఐసీసీ జోక్యం: స్పందించిన సీఈఓ రిచర్డ్‌సన్‌

మహిళలుగా జన్మించిన వారి తరఫున ట్రాన్స్‌జెండర్స్‌ పోటీపడడం సరైంది కాదని అందులో ఆమె అభిప్రాయపడ్డారు. నవ్రతిలోవా వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లెస్బియన్స్‌, గేస్‌, బైసెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్స్‌ మండిపడ్డారు. అంతేకాదు నవ్రతిలోవాను అథ్లెట్‌ అల్లీ గ్రూప్‌ అంబాసిడర్‌ హోదా నుంచి తప్పించారు.

దీంతో "వారి (ట్రాన్స్‌జెండర్స్‌) పట్ల మోసపూరితం అన్న పదం వాడడం తప్పే. నా వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతున్నా" అని 62 ఏళ్ల నవ్రతిలోవా తన బ్లాగ్‌లో వెల్లడించింది. అథ్లెట్‌ అల్లీ గ్రూప్‌ అనేది క్రీడల్లో ఎల్‌జీబీటీ (లెస్బియన్స్‌, గేస్‌, బైసెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్స్‌) హక్కుల తరఫున ప్రచారం చేస్తుంది. నవ్రతిలోవా కూడా లెస్బియన్‌ కావడం గమనార్హం.

Story first published: Tuesday, March 5, 2019, 10:37 [IST]
Other articles published on Mar 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X