హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలని స్విట్జర్లాండ్ దిగ్గజం, వరల్డ్ మాజీ నెంబర్ వన్ మార్టినా హింగిస్ నిర్ణయించుకుంది. సింగపూర్‌లో ప్రస్తుతం జరుగుతోన్న డబ్ల్యూటీఏ ఫైనల్స్ తన ఆఖరి టోర్నీ అని 37 ఏళ్ల హింగిస్ గురువారం ప్రకటించింది.
హింగిస్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం ఇది మూడోసారి. 23 ఏళ్ల క్రితం ప్రొఫెషనల్‌గా మారిన హింగిస్ తన కెరీర్‌లో 5 సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సహా మొత్తం 25 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకుంది. 16 ఏళ్ల వయసులోనే ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి సింగిల్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్ సాధించింది.

తద్వారా అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. వ్యక్తిగత కారణాలతో హింగిస్ 22 ఏళ్ల వయసులో తొలిసారి 2003లో రిటైరయ్యింది. ఆ తర్వాత 2006లో పునరాగమనం చేసింది. ఆ ఏడాది తర్వాత మరోసారి ఆటకు గుడ్‌బై చెప్పింది.
2013లో మళ్లీ పునరాగమనం చేసింది. 2103 నుంచి రెగ్యులర్‌గా డబుల్స్ ఆడుతోంది. ప్రస్తుతం డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది.