యుఎస్ ఓపెన్: ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తోన్న షరపోవా(వీడియో)

హైదరాబాద్: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్‌లో రష్యన్ టెన్నిస్ బ్యూటీ మారియా షరపోవా తనదైన స్టైల్‌లోనే ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. టోర్నీలో భాగంగా జరిగిన రెండో రౌండ్‌లో రొమేనియా స్టార్ సొరానా సిర్‌స్టియాపై 6-2, 7-5తేడాతో ఓడించి మూడో రౌండ్‌లోకి అర్హత సాధించింది.
తొలి సెట్‌లో షరపోవా ఏడు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడింది. అయినా సరే 3-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఇద్దరూ 34 అనవసర తప్పిదాలకు పాల్పడ్డారు. ఇక, రెండో గేమ్‌లో షరపోవా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మూడు బ్రేక్ పాయింట్లలో రెండు పాయింట్లను అలవోకగా దక్కించుకుంది.
తాజా విజయంతో షరపోవా ప్లడ్ లైట్ల కింద తనకు ఎదురులేదని మరోసారి నిరూపించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ నెగ్గడమే సెరెనా విలియమ్స్ లక్ష్యంగా దూసుకుపోతోంది. 2006లో యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన షరపోవా 12 ఏళ్ల తర్వాత తిరిగి టైటిల్ నెగ్గాలని పట్టుదలతో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications