వాషింగ్టన్: టెన్నిస్ హాటీ రష్యా క్రీడాకారిణి మరియా షరపోవా పెళ్లి చేసుకోబోతున్నది. లాస్ ఏంజెల్స్ లేకర్స్ గార్డు సశా వుజాసిక్ షరపోవాను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏడాది క్రితం చేతులో చేయి వేసుకుని ఈ ఇద్దరు జంటగా మొదటిసారి కనిపించారు. మంగళవారం నిశ్చితార్థం జరిగింది. మారియా నిశ్చితార్థం రింగును ధరించి కనిపించింది. తన పెళ్లి ప్రతిపాదనకు షరపోవా అంగీకరించిందని పుజాసిక్ చెప్పాడు. తామిద్దరం సంతోషంగా ఉన్నామని కూడా చెప్పాడు. ఏడాది క్రితం షరపోవా వద్ద అతను పెళ్లి ప్రతిపాదన చేశాడు. అయితే పెళ్లి తేదీ మాత్రం ఖరారు కాలేదు. 23 ఏళ్ల షరపోవా ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్ లో 18వ స్థానంలో ఉంది. ఆమె 2004లో వింబుల్డన్ విజేతగా నిలిచింది. 2006లో అమెరికా ఓపెన్ విజేతగా, 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది.