న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘షరపోవా సంపాదన’పై మీకెందుకు?: ‘వాడా’పై ఏజే ఫైర్

న్యూయార్క్: రష్యా టెన్ని క్రీడాకారిణి మారియా షరపోవా తరపు అటార్నీ జనరల్ జాన్ హాగర్టీ ప్రపంచ యాంటి డోపింగ్ ఏజెన్సీ(వాడా) అధిపతి క్రెయిగ్ రీడీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. షరపోవా ఆదాయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై జాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

లండన్‌లోని వాడా సదస్సులో సోమవారం రీడీ మాట్లాడుతూ.. సంస్థ వార్షిక బడ్జెట్ 30మిలియన్ అమెరికా డాలర్ల(26.5మిలియన్ యూరోస్) కంటే షరపోవా ఏడాది సంపాదన చాలా ఎక్కువగా ఉందని ఫిర్యాదు చేశాడు. ఈ అంశమే రీడీపై జాన్‌కు ఆగ్రహం తెప్పించింది.

Maria Sharapova's lawyer blasts WADA chief over income comment

వాడా అధ్యక్షుడు రీడీ చేసిన వ్యాఖ్యలు అనైతికమని జాన్ హాగర్టీ మండిపడ్డారు. గుడ్డిగా ఓ క్రీడాకారిణి ఆదాయంపై ఇలా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఒక విజయవంతమైన క్రీడాకారిణి అయిన షరపోవాకు రీడీ క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.

క్రీడాకారులు ఆదాయం, ర్యాంకులను బట్టి వాడా నిబంధనలు మారతాయా? అని జాన్ నిలదీశారు. నిషేధిత మెల్డోనియం అనే పదార్థాన్ని తీసుకున్నందుకు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య.. షరపోవాపై గత మార్చి నుంచి రెండేళ్లపాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X