వైల్డ్ కార్డ్ ఎంట్రీ: టెన్నిస్ అందం షరపోవాకు మద్దతు
హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్‌లో వైల్డ్‌కార్డ్ ద్వారా రష్యన్ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా వ్యతిరేకిస్తున్న వారిపై ఆ దేశ టెన్నిస్ చీఫ్ షామిల్ టర్పిచేవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. షరపోవా పక్కా ప్రొఫెషనల్ అని, ఆమెపై నిందలు వేయడం ఎంత మాత్రం మంచిది కాదన్నారు.
నిషేధిత మెల్డోనియం తీసుకున్న షరపోవాపై విధించిన నిషేధాన్ని 15 నెలలకు తగ్గించడంతో ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి జరిగే స్టట్‌గర్ట్ క్లేకోర్టు టోర్నీ ద్వారా ఆమె తిరిగి అరంగేట్రం చేయబోతోంది. ఇక ఫ్రెంచ్ ఓపెన్‌లో వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్న షరపోవాను కొందరు క్రీడాకారులు వ్యతిరేకిస్తున్నారు.

షరపోవా వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సోంగా
షరపోవా వైల్డ్ కార్డ్ ఎంట్రీని వ్యతిరేకిస్తున్న వారిలో పురుషుల ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ జో విల్‌ఫ్రెడ్ సొంగా ఉన్నాడు. ‘షరపోవాకు వైల్డ్‌కార్డ్ ఇవ్వడమంటే తప్పు చేసిన చిన్నారికి చాక్లెట్ ఇవ్వడం వంటిది' అని వ్యాఖ్యానించాడు. సోంగా వ్యాఖ్యలపై రష్యా టెన్నిస్ చీఫ్ షామిల్ టర్పిచేవ్ తీవ్రంగా విమర్శించారు.

షరపోవాకు మద్దతుగా నిలిచిన టెన్నిస్ చీఫ్
మెల్డోనియం తీసుకోవడం డోపింగ్ కిందకు రాదని నిరూపితమైందని షరపోవాకు మద్దతుగా నిలబడ్డారు. రష్యాకు చెందిన షరపోవా తన కెరీర్‌లో ఐదు గ్లాండ్ స్లామ్‌లను సొంతం చేసుకుంది. రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్‌ను కైవసం చేసుకొంది. నిషేధిత కాలంలో క్రీడాకారులకు ర్యాంకులు ఇవ్వరు. అందుకే ఆమె అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి అర్హత మ్యాచ్‌లు ఆడి మెయిన్‌డ్రాకు అర్హత సాధించాల్సి ఉంటుంది.

వైల్డ్ కార్డ్ ఇస్తే నేరుగా బరిలోకి దిగొచ్చు
అలా లేని పక్షంలో వైల్డ్ కార్డ్ ఇస్తే నేరుగా బరిలోకి దిగొచ్చు. ఇక తనపై విధించిన నిషేధిత కాలాన్ని షరపోవా చక్కగా సద్వినియోగం చేసుకుంటుంది. ఇందులో భాగంగా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించింది. ఇటీవలే ఓ ఇంటర్యూలో షరపోవా మాట్లాడుతూ ఖాళీ సమయంలో పుస్తకాలు చదివానని, క్రొయేషియాలో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొన్నానని షరపోవా తెలిపింది.

ఒక పర్యాటకురాలిగా లండన్ మొత్తం చుట్టొచ్చిన షరపోవా
వింబుల్డన్‌లో ఆడేటప్పుడు లండన్ చూడకపోవడంతో ఒక పర్యాటకురాలిగా లండన్ మొత్తం చుట్టొచ్చానని పేర్కొంది. ప్రస్తుతం హార్వర్డ్‌లో చదువుతున్న షరపోవా ఓ పుస్తకం రాస్తూనే, ఫిట్‌నెస్ పెంచుకునేందుకు బాక్సింగ్ నేర్చుకొంటోంది. ప్రస్తుతం తాను రాస్తున్న పుస్తకం సెప్టెంబర్‌లో విడుదలవుతుందని తెలిపింది. తొలుత ఇంగ్లిష్‌లో ఆ తర్వాత రష్యన్ భాషలోకి అనువాదం అవుతుందని షరపోవా పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications