For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైల్డ్‌ కార్డుతో ఎంట్రీ.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో షరపోవా!!

Maria Sharapova handed Australian Open wildcard

మెల్‌బోర్న్‌: టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో రష్యా అందం మరియా షరపోవా ఆడనుంది. వైల్డ్‌ కార్డు ద్వారా మాజీ విజేత షరపోవా ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో నేరుగా అడుగుపెట్టనుంది. గాయం కారణంగా గతేడాది మాజీ నంబర్‌వన్ షరపోవా ఎక్కువగా ఆటకు దూరమైంది. దాంతో ఆమె ర్యాంక్‌ 147కు పడిపోయింది. ర్యాంక్‌ ప్రకారం ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో షరపోవాకు మెయిన్‌ 'డ్రా'లో చోటు దక్కలేదు.

అయితే ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో 32 ఏళ్ల షరపోవా గత రికార్డును పరిగణనలోకి తీసుకొని టోర్నీ నిర్వాహకులు వైల్డ్‌ కార్డు ద్వారా నేరుగా మెయిన్‌ 'డ్రా'లో అవకాశం ఇచ్చారు. షరపోవా 2003లో తొలిసారి ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ ఆడింది. 2008లో చాంపియన్‌గా నిలవగా.. 2007, 2012, 2015లలో ఫైనల్లో రన్నరప్‌గా నిలిచింది.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడడంపై షరపోవా ఆనందం వ్యక్తం చేసింది. 'ఈ టోర్నీ ఆడనుండటం ఎంతో ప్రత్యేకం. చాలా సంతోషంగా ఉంది. ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో నాకెన్నో మధురజ్ఞాపకాలు ఉన్నాయి. ఒకసారి విజేతగా నిలిచాను. మూడుసార్లు ఫైనల్లో ఓడాను. మరోసారి ఇక్కడ ఆడే అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు' అని షరపోవా పేర్కొంది.

షెడ్యూల్ ప్రకారమే ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ జరుగనుంది. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 2 వరకు మెల్‌బోర్న్‌ పార్క్‌లో ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ జరగనుంది. ఈ మేరకు టోర్నీ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆ్రస్టేలియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కార్చిచ్చు సెగ టోర్నీకి తగులుతుందనే వార్తల్ని నిర్వాహకులు కొట్టిపారేశారు.

ఈ టోర్నీ ప్రైజ్‌మనీ రూ.350 కోట్లు. గతేడాది పోల్చుకుంటే 13.6 శాతం పెరిగింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతలకు నగదు బాహుమతి రూపంలో రూ.20 కోట్లు దక్కనుంది. ఇక తొలి రౌండ్‌లో నిష్క్రమించే వారికి రూ.44 లక్షలు, రెండో రౌండ్‌లో నిష్క్రమించే వారికి రూ.63 లక్షలు దక్కనుంది.

Story first published: Thursday, January 9, 2020, 8:59 [IST]
Other articles published on Jan 9, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+