Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నన్నుపెళ్లి చేసుకుంటావా?: కోర్టులో షరపోవాకు వింత అనుభవం

Maria Sharapova gets marriage proposal from fan in Turkey, says ‘maybe’ (VIDEO)

హైదరాబాద్: ర‌ష్యా టెన్నిస్ క్రీడాకారిణి మ‌రియా ష‌ర‌పోవాకు కోర్టులో వింత అనుభవం ఎదురైంది. ఇస్తాంబుల్‌లో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడుతున్న ఈ మాజీ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్‌‌కు ఓ తుంటరి అభిమాని పెళ్లి ప్ర‌పోజ‌ల్ చేశాడు. దీనికి షరపోవా ఇచ్చిన స‌మాధానం కోర్టులో ఉన్నవారందరినీ న‌వ్వులు పూయించింది.

ఐదు గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న షరపోవా వచ్చే గ్రాండ్‌స్లామ్‌ సీజన్‌ కోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇస్తాంబుల్‌లోని సినాన్ ఎర్దేం హాల్‌లో స్థానిక ప్లేయర్‌ కాగ్ల బైకుకాకేతో మ్యాచ్ ఆడుతుండ‌గా ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

బంతిని స‌ర్వ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న ష‌ర‌పోవాను 'మ‌రియా... న‌న్ను పెళ్లి చేసుకుంటావా' అని ఓ అభిమాని రష్యన్‌ భాషలో గట్టిగా అరిచాడు. దీనికి ఏమాత్రం విసుగు చెందని షరపోవా ఓ రెండు క్ష‌ణాలు ఆలోచించి...'ఏమో!' అని స‌మాధాన‌మిచ్చింది.

దీంతో అక్క‌డ ఉన్న వారంతా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యుటీఏ) ర్యాంకుల్లో కాగ్ల బైకుకాకే ప్రస్తుతం 161వ ర్యాంకులో కొనసాగుతోంది.

కాగ్ల బైకుకాకేతో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్ టై బ్రేక్‌గా ముగియగా, రెండో సెట్‌లో షరపోవా 7-6తో విజయం సాధించింది. 15నెలల నిషేధం తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో షరపోవా అంతర్జాతీయ టెన్నిస్‌లోకి తిరిగి పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, November 28, 2017, 13:24 [IST]
Other articles published on Nov 28, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+