Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌లో సంచలనం: వోజ్నియాకి షాకిచ్చిన షరపోవా

Maria Sharapova ends Caroline Wozniackis Australian Open defence

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌లో ఐదో రోజు సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ కరోలిన్‌ వోజ్నియాకి టోర్నీ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో మాజీ నంబర్‌వన్, 30వ సీడ్‌ షరపోవా 6-4, 4-6, 6-3తో మూడో సీడ్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌)పై గెలిచింది.

2 గంటల 24 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 2008 చాంపియన్‌ షరపోవా ఐదు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 46 అనవసర తప్పిదాలు చేసిన షరపోవా.... వొజ్నియాకి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసి విజయం సాధించింది. ప్రీక్వార్టర్స్‌లో షరపోవా స్థానిక క్రీడాకారిణి ఆష్లీ బార్తీతో తలపడనుంది.

వోజ్నియాకి షాకిచ్చిన షరపోవా

వోజ్నియాకి షాకిచ్చిన షరపోవా

ఇక, రెండో సీడ్‌ కెర్బర్‌ (జర్మనీ), ఐదో సీడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా), ఎనిమిదో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో కెర్బర్‌ 6-1, 6-0తో కింబర్లీ బిరెల్‌ (ఆస్ట్రేలియా)పై, స్లోన్‌ స్టీఫెన్స్‌ 7-6 (8/6), 7-6 (7/5)తో పెట్రా మార్టిక్‌ (క్రొయేషియా)పై, క్విటోవా 6-1, 6-4తో బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌)పై నెగ్గారు.

ప్రిక్వార్టర్‌‌కు ఫెదరర్‌

ప్రిక్వార్టర్‌‌కు ఫెదరర్‌

పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌), రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) ప్రిక్వార్టర్‌‌కు చేరారు. శుక్రవారం రాడ్‌ లావెర్‌ ఎరీనాలో జరిగిన మూడో రౌండ్‌ పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫెదరర్‌ 6-2, 7-5, 6-2 స్కోరుతో భారీ సర్వీసుల అమెరికా ఆటగాడు టేలర్‌ ఫ్రిట్జ్‌ను చిత్తు చేశాడు. రెండో సెట్లో తప్ప.. రోజర్‌కు ప్రత్యర్థి నుంచి పెద్ద ప్రతిఘటనే ఎదురు కాలేదు.

నాలుగో రౌండ్‌కు నాదల్

నాలుగో రౌండ్‌కు నాదల్

ఈ మ్యాచ్‌లో 10 ఏస్‌లతో పాటు 34 విన్నర్లు కొట్టాడతను. సెంటర్‌ కోర్టులో 100వ విజయం సాధించిన ఫెదరర్‌కు ఈ టోర్నీలో 17వ సారి నాలుగో రౌండ్‌కు చేరడం విశేషం. మరో మ్యాచ్‌లో నాదల్‌ 6-1, 6-2, 6-4తో డిమినర్‌ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. ఈ మ్యాచ్‌లో ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన నాదల్‌.. ఆరు ఏస్‌లతో పాటు 37 విన్నర్లు కొట్టాడు.

బెర్డిచ్‌తో తలపడనున్న నాదల్‌

బెర్డిచ్‌తో తలపడనున్న నాదల్‌

ప్రీక్వార్టర్‌ఫైనల్లో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన అన్‌ సీడెడ్‌ థామస్‌ బెర్డిచ్‌తో నాదల్‌ తలపడనున్నాడు. ఆరోసీడ్‌ సిలిచ్‌ కూడా మూడో రౌండ్లో గెలిచాడు. బెర్డిచ్‌ మూడో రౌండ్‌లో 5-7, 6-3, 7-5, 6-4 స్కోరుతో ష్వార్ట్‌జమన్‌ను ఓడించాడు. ఆరోసీడ్‌ మారిన్‌ సిలిచ్‌, బౌటిస్టా అగట్‌, టియాఫొ, డిమిత్రోవ్‌ కూడా మూడోరౌండ్‌లో విజయాలు సాధించారు.

Story first published: Saturday, January 19, 2019, 9:27 [IST]
Other articles published on Jan 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+