For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లి పీటలెక్కబోతోన్న 'రష్యా అందం' మరియా షరపోవా.. వరుడు ఎవరంటే?

Maria Sharapova announces engagement with boyfriend Alexander Gilkes

హైదరాబాద్: ఐదు సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్, రష్యా అందం మరియా షరపోవా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. బ్రిటిష్ వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్కేస్‌తో తన నిశ్చితార్ధం జరిగినట్టు గురువారం 33 ఏళ్ల షరపోవా ప్రకటించారు. గిల్కేస్‌ను ఆమె త్వరలో వివాహం చేసుకోనున్నారు. నిశ్చితార్ధంకు సంబందించిన ఫొటోను షరపోవా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మరోవైపు గిల్కేస్‌ కూడా ఫొటోతో విషయాన్ని షేర్ చేసుకున్నాడు.

6 అడుగుల 2 అంగుళాల పొడవైన రష్యన్ సుందరి మరియా షరపోవా తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. 'మేము కలిసిన మొదటి రోజు ఒకే అనుకున్నాం. ఇది ఇప్పటివరకు ఎవరికీ చెప్పబడని రహ్యసం' అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. నిశ్చితార్ధం చేసుకున్న మరియా షరపోవాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. టెన్నిస్ ఆటగాళ్లు కూడా షరపోవాకు అభినందనలు తెలుపుతున్నారు.

అలెగ్జాండర్ గిల్కేస్ ఆన్‌లైన్‌లో గృహాలను విక్రయించే పాడిల్8 సంస్థ స్థాపకుడు. ప్రస్తుతం ఈ వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. మరియా షరపోవా,అలెగ్జాండర్ గిల్కేస్ అక్టోబర్ 2018 నుంచి ప్రేమలో ఉన్నారు. బ్రిటిష్ మిలియనీర్ ప్రిన్స్ కుటుంబమైన హ్యారీ, ప్రిన్స్ విలియం,కేట్ మిడిల్టన్‌లకు అతడు అంత్యంత సన్నిహితుడు. ఐదు గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన ఈ రష్యా అందం 32 ఏళ్ల వయసులోనే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు.

33 ఏళ్ల మరియా షరపోవా ఈ ఏడాది ఫిబ్రవరిలో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పారు. తీవ్రమైన భుజం నొప్పితోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. 2004లో కేవలం 14 ఏళ్ల వయసున్నపుడే షరపోవా వింబుల్డెన్ ఛాంపియన్‌షిప్ గెలిచి సంచలనం సృష్టించారు. ఆ తరువాత 2006లో యూస్ ఓపెన్, 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి రికార్డుల మోత మోగించారు. ఇక 2012, 2014లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్‌లలో షరపోవా ప్రదర్శన ఆమె కెరీర్‌లో అత్యుత్తమమైనదిగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది. మొత్తం తన కెరీర్‌లో 36 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకుంది. ఒకప్పుడు అగ్రస్థానంలో కొనసాగిన షరపోవా.. 373 ర్యాంకుతో వీడ్కోలు పలకడం గమనార్హం.

Story first published: Friday, December 18, 2020, 19:45 [IST]
Other articles published on Dec 18, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+