Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అనుకోకుండా రాదనుకుందే వస్తే.. వేల కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం

Marco Trungelliti makes 500-mile family road trip into second round

హైదరాబాద్: రాదనుకున్న అవకాశం చేతికందడంతో ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని కుటుంబంతో సహా వేల కిలోమీటర్లు దాటి వేదికను చేరకున్నాడు. సమయానికి విమానాలు దొరకకపోవడంతో రోడ్డు ప్రయాణం చేసి తొలి రౌండ్లోనే తన కంటే మెరుగైన ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఇలా అందరినీ ఆశ్చర్యపరిచింది అర్జెంటీనా ఆటగాడు మార్కో ట్రుంజెలిటి.

అనుకోకుండా ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడే అవకాశం దక్కించుకున్న ట్రుంజెలిటి.. అర్జెంటీనా నుంచి బార్సిలోనాకు 1000 కి.మీ దూరం అర్ధరాత్రి కారు నడుపుకుంటూ చేరుకున్నాడు. అదీ తన సోదరుడు, అమ్మ, అమ్మమ్మలతో కలిసి! నిజానికి ట్రుంజెలిటికి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడే అవకాశమే చిత్రంగా దక్కింది. ట్రంగ్‌లిటి.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వాలిఫయింగ్‌ పోటీల్లో ఓడి నిరాశగా స్వస్థలానికి వచ్చేశాడు.

కిర్గియోస్‌ తప్పుకోవడంతో అతడికి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడే సువర్ణావకాశం దక్కింది. అసలు భారత ఆటగాడు ప్రజ్నేశ్‌కు ఈ అవకాశం దక్కాల్సి ఉన్నా అతడు అందుబాటులో లేకపోవడంతో ట్రంగ్‌లిటి ఛాన్స్‌ కొట్టేశాడు. విమానాలు పట్టుకుని వచ్చేంత సమయం అతనికి లేదు. దీంతో కుటుంబంతో సహా ఆదివారం అర్ధరాత్రి కారులో బయల్దేరి 11 గంటలు ప్రయాణం చేసి పోటీలకు వచ్చాడు.

తొలి రౌండ్లో తన కన్నా ఎన్నో రెట్లు మెరుగైన టామిక్‌ (ఆస్ట్రేలియా, 17వ ర్యాంకు) ఓడించి ట్రుంజెలిటి సంచలనం సృష్టించాడు. ఈ విజయం అనంతరం ట్రుంజెలిటీ మాట్లాడుతూ.. 'ఆ సమయంలో చాలా విమానాలు రద్దు అయిపోయాయి. వాటిని నమ్ముకుని కూర్చుంటే లాభం లేదనిపించింది. సమయానికి రైలెక్కి వద్దామన్నా.. అందుబాటులో లేకుండా పోయాయి. మరే ప్రత్యామ్నాయం లేక కారు ప్రయాణం చేయాల్సి వచ్చింది.' అని తెలిపాడు.

Story first published: Tuesday, May 29, 2018, 10:50 [IST]
Other articles published on May 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+