Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అమృత్‌రాజ్‌పై వేటు: డేవిస్ కప్ కెప్టెన్‌గా మహేశ్ భూపతి

హైదరాబాద్: డేవిస్ కప్ ఆడే భారత జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా వెటరన్ స్టార్ మహేశ్ భూపతిని నియమిస్తూ ఏఐటీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఈ స్ధానంలో ఉన్న టెన్నిస్ ఆటగాడు ఆనంద్ అమృత్‌రాజ్‌పై వేటు పడింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు పుణె వేదికగా న్యూజిలాండ్‌తో భారత జట్టు డేవిస్‌కప్‌లో తలపడనుంది. డేవిస్ కప్‌కు సంబంధించి సాకేత్ మైనేని, రామ్ కుమార్ రామనాథన్, యుకీ బాంబ్రీ, లియాండర్ పేస్, ప్రజ్నేష్ గున్నేశ్వరన్‌లతో కూడిన జట్టుని అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఏఐటీఏ) ప్రకటించింది.

Mahesh Bhupathi

ఈ నేపథ్యంలో అమృత్‌రాజ్ స్థానంలో మహేశ్ భూపతిని నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమృత్‌రాజ్ హయాంలో జట్టులోని ఆటగాళ్లలో క్రమశిక్షణ లోపించిందని అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఏఐటీఏ) భావించడంతో ఈ నిర్ణం తీసుకున్నారు.

మరో ఏడాదిపాటు తనను కొనసాగించాలని అమృత్‌రాజ్ పట్టుబడినప్పటికీ ఏఐటీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ అతడిని తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కోచ్ జీషాన్ అలీ పదవీకాలం కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో జీషాన్ స్థానంలో కోచ్ పదవికోసం సింగిల్స్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+