Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాటా మహారాష్ట్ర ఓపెన్: విజేతగా గిలెస్‌ సిమోన్‌

Maharashtra Open: Gilles Simon beats Kevin Anderson to win Pune title

హైదరాబాద్: పూణె వేదికగా జరిగిన టాటా ఓపెన్‌ మహారాష్ట్ర ట్రోఫీని ఫ్రాన్స్‌ స్టార్‌ గిలెస్‌ సిమోన్‌ కైవసం చేసుకున్నాడు. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ ఫ్రెంచ్ ఆటగాడు శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సైమన్ 7-6 (4), 6-2తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై విజయం సాధించాడు.

దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఈ మ్యాచ్‌లో సిమోన్‌ ధాటికి అండర్సన్ తట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా వ్యూహాత్మక షాట్లతో చెలరేగిన సిమోన్‌.. కీలక సమయంలో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆటపై పట్టు సాధించాడు. హోరాహోరీగా సాగిన తొలిసెట్‌లో అండర్సన్ గట్టిపోటీ ఇచ్చినా.. అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.

ఇక, రెండోసెట్‌లో రెండు సర్వీస్‌ను చేజార్చుకుని మ్యాచ్‌ను కోల్పోయాడు. 2015 తర్వాత సిమోన్ గెలిచిన తొలి టైటిల్ ఇదే కావడం విశేషం. మరోవైపు నెదర్లాండ్స్‌ జోడీ రాబిన్‌ హాస్‌-మిడిల్‌కూ్‌ప 7-6 (5), 7-6(5)తో ఫ్రాన్స్‌కు చెందిన హెర్బట్‌-సిమోన్‌ జోడీపై గెలిచి డబుల్స్‌ టైటిల్‌ను దక్కించుకుంది.

Story first published: Sunday, January 7, 2018, 11:34 [IST]
Other articles published on Jan 7, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+