Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మాడ్రిడ్‌ ఓపెన్‌లో ఫెదరర్‌కు షాక్‌

Madrid Open: Dominic Thiem beats Roger Federer to set up Novak Djokovic meeting

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత క్లే కోర్టు టోర్నీలో ఆడుతున్న స్విస్‌ స్టార్ రోజర్‌ ఫెదరర్‌కు ఊహించని షాక్‌ తగిలింది. మాడ్రిడ్‌ ఓపెన్‌లో ఫెదరర్‌ క్వార్టర్‌ఫైనల్లోనే నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ ఫెదరర్‌ 6-3, 6-7 (11/13), 4-6తో ఐదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) చేతిలో ఓటమిపాలయ్యాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

2 గంటల 10 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫెదరర్‌ అవనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. రెండో సెట్‌ టైబ్రేక్‌లో ఫెడరర్‌కు గెలిచే అవకాశం వచ్చినా.. సద్వినియోగం చేసుకోలేదు. మరోవైపు థీమ్‌ రెండో సెట్‌ను టైబ్రేక్‌లో సొంతం చేసుకున్నాడు. ఇక మూడో సెట్‌లోఅద్భుతంగా ఆడిన థీమ్‌.. మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. ఫెదరర్‌, థీమ్‌ ఇప్పటివరకు ఆరుసార్లు తలపడగా.. థీమ్‌ నాలుగుసార్లు విజయం సాయించాడు.

స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. నాదల్ 6-1 6-2తో స్టాన్ వావ్రింకాపై గెలుపొందాడు. 69 నిమిషాల్లో నాదల్ మ్యాచ్‌ను ముగించాడు. థీమ్‌ సెమీఫైనల్‌లో నొవాక్‌ జకోవిచ్‌తో తలపడనున్నాడు.

Story first published: Saturday, May 11, 2019, 9:36 [IST]
Other articles published on May 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+