Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో లవ్ మ్యాచ్: అందరి దృష్టి ఆ ఇద్దరిపైనే!

Love match: Everyones crazy for Monfils and Svitolina

హైదరాబాద్: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మరో కొత్త ప్రేమకథ మొదలైంది. ఫ్రాన్స్‌కు చెందిన గేల్‌ మోన్‌ఫిల్స్, ఉక్రెయిన్‌ క్రీడాకారిణి ఎలీనా స్వితోలినా తాము ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆరో సీడ్‌ స్వితోలినా మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో మోన్‌ఫిల్స్‌ ప్లేయర్‌ బాక్స్‌లో కూర్చొని ఆమెను ప్రోత్సహించడం కనిపించింది.

దీంతో వీరిద్దరి ప్రేమాయణం నిర్ధారణ అయింది. దీంతో ఫ్రెంచ్‌ స్టార్‌ మోన్‌ఫిల్స్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు స్వితోలినా గతవారమే వెల్లడించింది. "అవును, అతడు నాకోసమే వచ్చాడు. నాకు మద్దతుగా ఉన్నాడు. నేను కూడా అతని కోసమే ఉన్నాను. ఇప్పుడు మా మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ఇద్దరికీ బాగా తెలుసు" అంటూ స్వితోలినా వెల్లడించింది.

జీ.ఈ.ఎం.ఎస్‌ లైఫ్‌ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా

తమ ఇద్దరి పేర్లు ‘గేల్‌ ఎలీనా మోన్‌ఫిల్స్‌ స్వితోలినా'లను కలుపుతూ వీరు జీ.ఈ.ఎం.ఎస్‌ లైఫ్‌ పేరుతో ఒకే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచి తమ దైనందిన షెడ్యూల్‌పై వీడియోను కూడా పోస్ట్‌ చేశారు. దీంతో స్వితొలినా-మోన్‌ఫిల్స్‌ మాత్రమే కాదు వావ్రింకా-డొనా వికిచ్‌, డొనిమిక్‌ థీమ్‌-మ్లదెనోవిచ్‌ కూడా ఉమ్మడి ఖాతాలు తెరిస్తే చూడాలని ఉంది అని ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ డారియా గవ్‌రిలొవా అంది.

ప్రస్తుతం 7వ ర్యాంక్‌లో కొనసాగుతున్న స్వితోలినా

ప్రస్తుతం 7వ ర్యాంక్‌లో కొనసాగుతున్న స్వితోలినా

ప్రస్తుతం 7 ఏటీపీ టైటిల్స్‌ గెలిచిన 32 ఏళ్ల మోన్‌ఫిల్స్‌ ప్రస్తుతం 33వ ర్యాంక్‌లో ఉన్నాడు. 13 డబ్ల్యూటీఏ టైటిల్స్‌ సాధించిన 24 ఏళ్ల స్వితోలినా ప్రస్తుతం 7వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. మరోవైపు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ప్రేయసి జిస్కా పెరెల్లో ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ చూసేందుకు స్టేడియానికి వచ్చింది.

నాదల్ ప్రేయసి గురించి ఇలా

నాదల్ ప్రేయసి గురించి ఇలా

దీనిపై మాజీ ఆటగాడు జిమ్‌ కొరియర్‌ చాలా కాలం తర్వాత పెరెల్లో వచ్చినట్టుంది అని అడగ్గా "2005లో వైల్డ్‌కార్డు రూపంలో నా హృదయంలో ప్రవేశించింది. పద్నాలుగేళ్లు నాతో కలిసి ఉన్న తర్వాత తను తిరిగి ఇక్కడికి రావడానికి వైల్డ్‌కార్డు అవసరం లేదు. ఆమె ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావొచ్చు" అని నాదల్ చెప్పాడు.

Story first published: Monday, January 21, 2019, 11:39 [IST]
Other articles published on Jan 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+