Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వీసా కేసులో జోకోవిచ్‌కు ఊర‌ట‌.. ఇక‌ రికార్డు గ్రాండ్‌స్లామ్‌పై గురి

Line is clear for Novak Djokovic to play in the Australian Open

ఆస్ట్రేలియా: వీసా ర‌ద్దు కేసులో సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్‌కు కోర్టులో ఊర‌ట ల‌భించింది. ఈ కేసులో మెల్‌బోర్న్ ఫెడరల్ సర్క్యూట్ ఫ్యామిలీ కోర్టు జోకోవిచ్‌కు అనుకూలంగా సంచ‌ల‌న‌ తీర్పు వెలువ‌రించింది. జోకోవిచ్ వీసాను రద్దు చేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు ర‌ద్దు చేసింది. అంతేకాకుండా అకార‌ణంగా జోకోవిచ్ వీసాను ర‌ద్దు చేశార‌ని పేర్కొంది. జడ్జి ఆంథోనీ కెల్లీ జోకోవిచ్‌ను విడుదల చేయవలసిందిగా ఆదేశించారు.

అలాగే అతని పాస్‌పోర్ట్, ఇతర ప్రయాణ పత్రాలను అతనికి తిరిగి ఇవ్వాల‌ని అధికారుల‌కు సూచించారు. దీంతో ఆస్ట్రేలియా ప్ర‌భుత్వానికి బ్రేక్‌లు ప‌డ్డాయి. జోకోవిచ్ ఆస్ట్రేలియాన్ ఓపెన్‌లో ఆడ‌డానికి లైన్ కూడా క్లియ‌రైంది. దీంతో ప్ర‌స్తుతం డిటెన్ష‌న్ సెంట‌ర్‌లో ఉన్న జోకోవిచ్‌ విడుద‌ల కానున్నాడు. అంతే కాకుండా యూఎస్ ఓపెన్‌లో జోకోవిచ్ పాల్గొన‌డంపై ఉన్న అనుమానాలు కూడా తొల‌గిపోయాయి.

అయితే ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం మాత్రం జోకోవిచ్‌ను మ‌రోసారి హెచ్చ‌రించింది. ఈ కేసుకు సంబంధించి కోర్టులో మ‌ళ్లీ అప్పీలు చేయ‌నున్న‌ట్లు ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేష‌న్ మంత్రి తెలిపారు. అంతేకాకుండా జోకోవిచ్ వీసా ర‌ద్దు కోసం ఇమ్మిగ్రేష‌న్ కార్యాల‌యం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయ‌వాది ట్రాన్.. కోర్టులో వెల్ల‌డించారు. ఒక వేళ ఇమ్మిగ్రేష‌న్ కార్యాల‌యం జోకోవిచ్ వీసాను ర‌ద్దు చేస్తే అత‌ను ఆస్ట్రేలియాలోకి అడుగు పెట్ట‌కుండా మూడేళ్లు నిషేధం ఎదుర్కొవ‌ల్సి ఉంటుంది.

34 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న జోకోవిచ్ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడేందుకు మెల్‌బోర్న్ విమానాశ్ర‌యానికి చేరుకున్నాడు. అయితే అత‌ను క‌రోనా వ్యాక్సిన్‌ తీసుకోక‌పోవ‌డానికి గ‌ల స‌రైన కార‌ణాలు చూప‌లేద‌ని అధికారులు విమాన‌శ్ర‌యంలోనే నిలిపివేశారు. అంతేకాకుండా జోకో పాస్ట్‌పోర్టును కూడా ర‌ద్దు చేశారు. దీంతో త‌న‌కు న్యాయం చేయాలంటూ జోకోవిచ్ కోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే.

బుధ‌వారం ప్రారంభంకానున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో జోకోవిచ్ పాల్గొన‌డం ఖాయ‌మైపోయింది. జోకోవిచ్ క‌నుక ఈ ట్రోఫీ గెలిస్తే టెన్నిస్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక గ్రాండ్‌స్టామ్‌లు నెగ్గిన ఆట‌గాడిగా నిలిచిపోతాడు. ఇప్ప‌టివ‌ర‌కు కెరీర్‌లో 20 గ్రాండ్‌స్టామ్‌లు నెగ్గిన జోకోవిచ్.. మ‌రో టెన్నిస్ దిగ్గ‌జం రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌తో క‌లిసి స‌మంగా ఉన్నాడు. అయితే త‌న కెరీర్‌లో జోకోవిచ్ అత్య‌ధిక సార్లు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌నే గెలిచాడు. త‌న మొత్తం 20 గ్రాండ్ స్లామ్‌ల‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 9 గ్రాండ్ స్టామ్‌లను ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లోనే సాధించాడు.

Story first published: Monday, January 10, 2022, 14:08 [IST]
Other articles published on Jan 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+