
ఒలింపిక్స్‌కు చాలా సమయం ఉంది:
స్పోర్ట్‌లైట్ చాట్ షో సందర్భంగా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ముదిత్ డానీతో మాట్లాడుతూ... 'టోక్యో ఒలింపిక్స్‌కు ఇంకా చాలా సమయం ఉంది. జూలై లేదా ఆగస్టు నాటికి క్రీడలు ప్రారంభమవుతాయని నేను నమ్ముతున్నా. ఎవరికి తెలుసు.. అక్టోబర్, నవంబర్ నెలలో కూడా ప్రారంభం కావొచ్చు. మన చేతుల్లో లేదు. లాక్‌డౌన్ సమయంలోనూ మా జట్టు ప్రాక్టీస్ చేసింది. ‘ఒన్ లాస్ట్ రోర్' 2021లో ముగుస్తుందో లేదో చెప్పలేం' అని అన్నాడు.

సెంచరీ కొట్టాలనుకుంటున్నా:
'ఇప్పటి వరకు 97 గ్రాండ్‌స్లామ్స్‌లో ఆడా. మరో మూడు ఆడితే సెంచరీ పూర్తవుతుంది. అలాగే దేశం తరఫున ఎనిమిదోసారి ఒలింపిక్స్‌లో అడుగుపెట్టనున్నా. టెన్నిస్‌లో ఏ దేశం తరఫునైనా ఇవే అత్యధికం. నేను ఇష్టపడే బెంచ్ మార్క్ అది (100 గ్రాండ్‌స్లామ్స్). నేను అక్కడికి చేరుకోకపోయినా.. ఇప్పటివరకు దేశానికి చేసిన సేవతో ఆనందంగా ఉంది.ప్రస్తుతానికైతే ఆటను ఆస్వాదిస్తున్నా. కెరీర్‌తో సంతృప్తిగా ఉన్నా' అని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ చెప్పుకొచ్చాడు.

18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్:
1991లోనే తన ప్రస్థానాన్ని ఆరంభించిన లియాండర్ పేస్ ఇప్పటి వరకు 28 ఏళ్లకు పైగా టెన్నిస్ ఆట ఆడాడు. ఈ సుదీర్ఘ కెరీర్‌లో 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, 55 కెరీర్ టైటిల్స్ ఖాతాలో వేసుకున్నాడు. 2016 ఫ్రెంచ్ ఓపెన్ పేస్ చివరి ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్. 46 ఏళ్ల వయసులో డేవిస్ కప్‌లో 44వ విజయం సాధించి ఈ టోర్నీ చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్లేయర్‌గా పేస్ చరిత్ర లిఖించాడు. అయితే ఇటీవలి కాలంలో పేస్ ఆట ఏమాత్రం బాగాలేదు. దాంతో 19 ఏళ్లలో తొలిసారి అతడి ర్యాంక్ 100 కంటే దిగజారింది.

700కు పైగా విజయాలు:
అంతర్జాతీయ టెన్నిస్‌లో 700కు పైగా విజయాలు సాధించిన కేవలం ఎనిమిది మంది ఆటగాళ్ళలో పేస్ ఒకడు. 18 గ్రాండ్‌స్లామ్‌లు (8 పురుషుల డబుల్స్, 10 మిక్స్‌డ్ డబుల్స్) గెలిచారు. వరుసగా 7 ఒలింపిక్స్‌లలో (1992, 1996, 2000, 2004, 2008, 2012, 2016) పాల్గొన్న ఏకైక టెన్నిస్ ఆటగాడు మన పేస్. కెరీర్‌లో పేస్ ఇప్పటివరకు 55 టైటిల్స్ సాధించారు. ఇందులో సింగిల్స్‌లో ఒక టైటిల్ ఉండగా.. మిగతా 54 టైటిల్స్ డబుల్స్‌లో వచ్చాయి.


Click it and Unblock the Notifications












