Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కూతురు కస్టడికి రియా పిళ్లైను కోర్టుకు లాగిన పేస్

ముంబై: తన కూతురు సంరక్షణ బాధ్యతలను శాశ్వతంగా తనకే అప్పగించాలని కోరుతూ భారత టెన్నిస్ క్రీడాకారుడు బాంద్రా ఫ్యామిలీ కోర్టును శనివారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సహజీవన భాగస్వామి రియా పిళ్లై వల్ల తన కూతురు ఐయానా జీవితం ప్రమాదంలో పడుతుందని పేస్ ఆరో పించాడు.

ఎనిమిదేళ్ల తన కూతురిని బలవంతాన దేశం దాటించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే కోర్టు అనుమతి లేకుండా తన కూతురిని ముంబై వెలుపలకు తీసుకువెళ్లకుండా ఉండేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. పేస్‌దశాబ్ద కాలంగా రియాతో సహజీవనం చేస్తున్నాడు. ఈ ఇద్దరికీ 2006లో కూతురు జన్మించింది.

Leander Paes seeks to Court for Daughter's Custody

విభేదాల కారణంగా ఇప్పుడు ఈ ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ప్రతి చిన్న విషయానికీ విపరీతంగా ఆవేశపడే రియా, కూతురి పెంపకంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిసుందని పేస్ అన్నాడు. ఈ తరహా వ్యక్తి ప్రభావం తన కూతురు మానసిక స్థితి, ఆమె ఎదుగుదలపై ప్రభావం చూపగలద అన్నాడు.

కోర్టుకు సమర్పించిన 30 పేజీల పిటిషన్‌లో తాను ఉత్తమ సంరక్షుడిగా, తండ్రిగా ఎలా ఉండగలనో ఉదాహరణలతో సహా వివరించాడు. 2008లో పరస్పర అంగీకారంతో సంజయ్ దత్ నుంచి విడాకులు పొందిన రియా, తనకు మాత్రం 2005లోనే విడాకులు తీసుకున్నట్లు చెప్పి మోసం చేసిందని అన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+