మళ్లీ టాప్ 50లో చోటు సంపాదించుకున్న లియాండర్ పేస్

హైదరాబాద్: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్-50లోకి వచ్చాడు. గతవారం దుబాయ్ ఓపెన్‌లో జేమీ సెరెటాని (అమెరికా)తో కలిసి రన్నరప్‌గా నిలవడంతో పేస్ ఆరు స్థానాలు పురోగతి సాధించాడు. 46వ ర్యాంకులో నిలిచాడు.
రోహన్ బోపన్న (20), దివిజ్‌శరణ్ (44) ర్యాంకుల్లో మార్పుల్లేవు. పూరవ్ రాజా 62వ ర్యాంకులో ఉండగా.. విష్ణువర్దన్ కెరీర్‌లో ఉత్తమంగా 99వ ర్యాంకులో నిలిచాడు. సింగిల్స్‌లో యుకి బాంబ్రి ఐదు ర్యాంకులు కోల్పోయి 110వ స్థానంలో నిలవుగా.. రామ్‌కుమార్ (135), సుమిత్ నగాల్ (223), ప్రజ్నేశ్ గుణ్నేశ్వరన్ (235) తర్వాత ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అతడు 46వ స్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన రోహన్ బోపన్న 20వ ర్యాంక్‌లో, దివిజ్ శరణ్ 44వ ర్యాంక్‌లో ఉన్నారు. సింగిల్స్‌లో యూకీ బాంబ్రీ 110వ స్థానంలో ఉన్నాడు.
మహిళల సింగిల్స్ విభాగంలో అంకిత్ రైనా ఐదు స్థానాలు కిందకు పడిపోయి 255 గా ఉంది. కౌర్ తంది మూడు స్థానాలు మెరగై 278కి చేరుకుంది. డబుల్స్‌లో సానియామీర్జా (13) ర్యాంకులో మార్పు లేదు. గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న సానియా మీర్జా మరి కొద్ది రోజుల్లో టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications