For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేస్‌కు 17వ గ్రాండ్ స్లామ్: ఇంటిబాట పట్టిన సెరీనా

By Nageswara Rao

హైదరాబాద్: వరుస విజయాలతో భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్‌ దూసుకుపోతున్నాడు. తాజాగా యుఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సత్తా చాటుతున్న పేస్, తాజాగా యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు.

Leander Paes, Martina Hingis Win US Open Mixed Doubles Title of 2015

యుఎస్ ఓపెన్‌ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మార్టినా హింగిస్‌తో కలిసి 6-4, 3-6, 10-7 తేడాతో మాటెక్‌ - సాండ్స్‌ జోడీపై విజయం సాధించారు. ఈ టైటిల్‌తో లియాండర్ పేస్ 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు నెగ్గిన క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు.

సెమీస్‌లో సెరీనా విలియమ్స్ ఘోర పరాజయం

యుఎస్ ఓపెన్‌ సెమీస్‌లో సెరీనా విలియమ్స్ అన్ సీడెడ్ క్రీడాకారిణి రోబెర్ట్ విన్సీ (ఇటలీ) చేతిలో పాలైంది. ఇప్పటికే ఈ కేలండర్ ఇయర్‌లో మూడు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను నెగ్గిన సెరీనా విలియమ్స్ ఈ యుఎస్ ఓపెన్ కూడా గెలిచి ఉంటే, ఒక కేలండర్ ఇయర్‌లో నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను నెగ్గిన క్రీడాకారిణిగా రికార్డులకెక్కేది.

సెమీస్‌లో విజయం సాధించి, ఆ తర్వాత ఫైనల్స్‌లో విజయం సాధించి ఉంటే 27 ఏళ్లుగా సాధ్యం కాని ఈ రికార్డుని సెరీనా తమ పేరిట నమోదు చసేదే. ఇక క్వార్టర్ ఫైనల్స్‌లో తన అక్క వీనస్ విలియమ్స్‌ను అలవోకగా చిత్తు చేసిన సెరీనా సెమీస్‌లో మాత్రం విన్సీతో పోరాడినా ఓటిమి పాలైంది.

Leander Paes, Martina Hingis Win US Open Mixed Doubles Title of 2015

భారత కాలమానం ప్రకారం గత అర్ధరాత్రి జరిగిన సెమీ ఫైనల్ లో అన్ సీడెడ్ గా బరిలోకి దిగిన విన్సీ 2-6, 6-4, 6-4 స్కోరుతో సెరెనాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో విజయంతో అసలు అంచనాలే లేకుండా దూసుకొచ్చిన విన్సీ నేరుగా ఫైనల్ చేరుకోగా, టైటిల్ ఖాయంగా చేజిక్కించుకుంటుందనుకున్న సెరెనా విలియమ్స్ మాత్రం ఇంటిబాట పట్టింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+