For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేస్ జోడీకి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్: జకోదే వింబుల్డన్

లండన్: ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. కెరీర్‌లో 9వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించిన జకో.. ఆదివారం నాటి ఫైనల్‌లో రెండోసీడ్ రోజర్ ఫెదరర్‌ను 7-6, 6-7, 6-4, 6-3 తేడాతో ఓడించాడు. దీంతో మూడోసారి వింబుల్డన్‌లో విజేతగా నిలిచాడు.

ఫెదరర్ తొలి రౌండ్‌లో డామిర్ జుంహర్, రెండోరౌండ్‌లో సామ్ క్వెరీ, మూడో రౌండ్‌లో సామ్ గ్రాత్, ప్రీ క్వార్టర్స్‌లో గిలెస్ సిమోన్‌లను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్‌లో బటిస్టా అగట్‌పై విజయం సాధించాడు. తీవ్ర స్థాయిలో పోటీపడి, సెమీ ఫైనల్‌లో బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రేను 7-5, 7-5, 6-4 తేడాతో ఓడించి ఫైనల్ చేరాడు.

Leander Paes-Martina Hingis pair wins Wimbledon mixed doubles title

మరో వైపు జొకోవిచ్ మొదటి రౌండ్‌లో ఫిలిప్ కొల్చెర్బర్, రెండో రౌండ్‌లో జార్కో నీమినెన్, మూడో రౌండ్‌లో బెనార్డ్ టామిక్, ప్రీ క్వార్టర్స్‌లో కెవిన్ ఆండర్సన్‌లపై విజయాలను నమోదు చేశాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో మారిన్ సిలిక్‌ను ఓడించాడు. సెమీ ఫైనల్‌లో కడవరకూ శ్రమించి రిచర్డ్ గాస్క్వెట్‌పై 7-6, 6-4, 6-4 తేడాతో గెలిచి ఫైనల్‌లో స్థానం సంపాదించాడు.

పేస్ జోడీదే మిక్స్‌డ్ డబుల్స్

వయసు పెరిగినా ఆటలో వన్నె తగ్గని భారత టెన్నిస్ హీరో లియాండర్ పేస్ ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది. 42ఏళ్ల ఈ వెటరన్ స్టార్.. మరో వెటరన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్‌తో కలిసి వింబుల్డన్‌లో మిక్స్‌డ్ ఛాంపియన్‌గా నిలిచాడు.

Leander Paes-Martina Hingis pair wins Wimbledon mixed doubles title

ఆదివారం జరిగిన ఫైనల్లో పేస్-హింగిస్(స్విట్జర్లాండ్) జోడీ 6-1, 6-1తో అలెగ్జాండర్ పెయా-తిమియా బాబోస్ జంటను వరుస సెట్లలో ఓడించి ఈ సీజన్‌లో రెండో గ్రాండ్‌స్లామ్‌ను అందుకుంది. పేస్-హింగిస్ జంట ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ విజేతగా నిలిచింది.

కాగా, పేస్‌కిది కెరీర్‌లో 16వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఓవరాల్‌గా 8వ మిక్స్‌డ్ టైటిల్ సాధించిన పేస్.. వింబుల్డన్‌లో నాలుగోసారి మిక్స్‌డ్ ట్రోఫీని ముద్దాడాడు. 34ఏళ్ల హింగిస్‌కిది 18వ మేజర్ టైటిల్ కాగా, మూడో మిక్స్‌డ్ టైటిల్.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+