న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత ఏషియాడ్ స్క్వాడ్‌లోకి లియాండర్ ఫేస్, టోర్నీకి యుకీ దూరం

Leander Paes in Indias Asiad squad; Yuki to skip to play US Open

హైదరాబాద్: 45 ఏళ్ల భారత టెన్నిస్‌ దిగ్గజం.. వెటరన్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌ మరోసారి ఆసియా క్రీడల బరిలోకి దిగబోతున్నాడు. ఏషియాడ్‌ కోసం సోమవారం అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) ప్రకటించిన ఆరుగురు సభ్యుల జట్టులో పేస్‌కు చోటు లభించింది. 1994 నుంచి 2006 వరకు నాలుగు సార్లు ఆసియా క్రీడల్లో పాల్గొని ఎనిమిది పతకాలు సాధించిన పేస్‌ 2010, 2014 పోటీలకు దూరమయ్యాడు. పతకాల వేటలో ఇప్పుడు మళ్లీ కొత్త ఉత్సాహంతో సన్నద్ధమయ్యాడు.

సింగిల్స్‌లో భారత అత్యుత్తమ ర్యాంకర్‌ (94) అయిన యూకీ బాంబ్రీ యూఎస్‌ ఓపెన్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశం ఉండటంతో అతడిని ఎంపిక నుంచి మినహాయిస్తున్నట్లు 'ఐటా' ప్రకటించింది. ఆసియా క్రీడల సమయంలోనే యూఎస్‌ ఓపెన్‌ టోర్నీ కూడా జరగనుంది. ముగ్గురు సింగిల్స్‌ స్పెషలిస్ట్‌లు రామ్‌కుమార్‌ రామనాథన్, ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్, సుమిత్‌ నాగల్‌లను... ముగ్గురు డబుల్స్‌ స్పెషలిస్ట్‌లు పేస్, రోహన్‌ బోపన్న, దివిజ్‌ శరణ్‌లను కమిటీ ఎంపిక చేసింది.

డేవిస్‌ కప్‌ నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌గా ఉన్న మహేశ్‌ భూపతి తాను ఏషియాడ్‌కు దూరంగా ఉంటానని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో జీషాన్‌ అలీకి ఆ బాధ్యతలు అప్పగించారు. ఏషియన్ మహిళల స్క్వాడ్‌కు గైడ్‌గా భారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్ అంకిత బాంబ్రీ బాధ్యత వహించనుంది. మహిళల సింగిల్స్‌లో అంకితా రైనా, కర్మన్ కౌర్ తండి, రుతుజా భోసలె, ప్రంజల ఎడ్లపల్లి, రియా భాటియా, ప్రతానా థొంబరేలు మిగిలియన ప్లేయర్లు.

2006లో దోషా గేమ్స్ దగ్గర నుంచి ఏషియన్ గేమ్స్‌లో లియాండర్ ఫేస్ పాల్గొనడం ఇదే తొలిసారి. పురుషుల డబుల్స్ విభాగంలో ఫేస్ ఇంతకుముందు ఎనిమిది పతకాలు గెలుచుకున్నాడు. డబుల్స్ విభాగంలో మహేశ్ భూపతితో కలిసి, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జాతో కలిసి పాల్గొన్నాడు.

ఫేస్ పురుషుల సింగిల్స్ విభాగంలో 1994లో కాంస్యాన్ని, పురుషుల డబుల్స్‌లో 3 సార్లు స్వర్ణాన్ని(1992 నుంచి 1996 వరకూ), 2006లో సానియా మీర్జాతో కలిసి స్వర్ణాన్ని, మళ్లీ అదే జోడీ 2002లో కాంస్యాన్ని, జట్టుతో కలిసి 1990లో కాంస్యాన్ని గెలుచుకున్నాడు.

Story first published: Tuesday, June 5, 2018, 11:08 [IST]
Other articles published on Jun 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X