Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కూతురుకోసం కెరీర్ వదిలేస్తా: రియాపిళ్లైతో గొడవపై పేస్

ముంబై: కుమార్తె కోసం టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, ఆయన ప్రియురాలు రియా పిళ్లైల మధ్య రగడ సాగుతున్న విషయం తెలిసిందే. కూతురు కోసం లియాండర్ పేస్ తన కెరీర్‌ను వదులుకునేందుకు కూడా సిద్ధపడ్డాడు. తన కుమార్తె కోసం కెరీర్ వదులుకునేందుకు తాను వెనుకాడనని ఆయన చెప్పాడు.

తనపై రియా పిళ్లై చేస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులన్నీ అవాస్తవాలన్నాడు. తాను ఇంటిలో బంధించినట్లు ఆమె చెప్పడం సరికాదన్నాడు. తన కూతురి సంరక్షణ పిటిషన్‌లో తాను పేర్కొన్న ప్రతీ అంశంపై డాక్యుమెంటరీ ఆధారాలున్నాయని చెప్పాడు. కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Leander Paes Decides to skip French Open

ఈ నెల 25 తేదీ నుండి ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ సెకండ్ గ్రాండ్ స్లామ్ అయిన ఇది పారీస్‌లో ప్రారంభం కానుంది. అయితే తన కూతురు కస్టడీ విషయంలో రియా పిళ్లైతో కేసు కారణంగా అతను ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా, కుమార్తె సంరక్షణ బాధ్యతల విషయంలో టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, అతడి సహచర భాగస్వామి రియా పిళ్లై మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇంట్లో బంధించి తాళం వేసినట్టు పేస్‌పై బాంద్రా పోలీసులకు రియా ఫిర్యాదు చేసింది. దీంతో పేస్ వివరణ ఇచ్చాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+