For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాల్ ఆఫ్ ఫేమ్‌లో లియాండర్ పేస్, విజయ్

భారత దిగ్గజ టెన్నిస్ ఆటగాళ్లు లియాండర్‌ పేస్, విజయ్‌ అమృత్‌రాజ్‌‌లకు అరుదైన గౌరవం దక్కింది. టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ప్లేయర్ కేటగిరీలో ఈ ఘనత అందుకున్నారు. ఆసియా నుంచి ఈ గౌరవాన్ని అందుకున్న తొలి క్రీడాకారులుగా పేస్, విజయ్ చరిత్రకెక్కారు. అమెరికా ప్లేయర్ రిచర్డ్ ఇవాన్స్ కూడా హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం సంపాదించాడు.

51 ఏళ్ల లియాండర్ సేస్ ఎన్నో సంచలన విజయాలు నమోదు చేశాడు. వరుసగా ఏడు ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొన్న ఏకైక టెన్నిస్ క్రీడాకారుడిగా రికార్డులు నెలకొల్పాడు. 1992 బార్సిలోనా నుంచి 2016 రియో ఒలింపిక్స్ వరకు బరిలోకి దిగాడు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గాడు. ఒలింపిక్స్‌లో టెన్నిస్ విభాగంలో భారత్ ఇప్పటి వరకు నెగ్గిన పతకం పేస్ సాధించింది మాత్రమే.

Leander Paes and Vijay Amritraj Honored with Induction into International Tennis Hall of Fame

లియాండర్ పేస్ కంటే ముందు, తర్వాత ఏ భారత టెన్నిస్ ప్లేయర్ పతకాన్ని అందుకోలేకపోయారు. ఇక పేస్ కెరీర్‌లో గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో ఎనిమిది డబుల్స్, పది మిక్సడ్ డబుల్స్ టైటిళ్లు గెలిచాడు. అంతేగాక డేవిస్ కప్‌లో భారత్‌‌కు అపూర్వ విజయాలు అందించాడు. మరోవైపు 70 ఏళ్ల విజయ్ అమృత్‌రాజ్ తన ఆటతో పేస్‌ కన్నా ముందు భారత టెన్నిస్‌కు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చాడు.

విజయ్ తన కెరీర్‌లో వింబుల్డన్, యుఎస్‌ ఓపెన్‌ టోర్నీల్లో క్వార్టర్‌ఫైనల్‌ చేరాడు. 1974, 1987లో భారత‌ జట్టు డేవిస్‌కప్‌ ఫైనల్‌కు చేరడంలో విజయ్ ప్రధానపాత్ర పోషించాడు. కాగా, ఇప్పటివరకు 28 దేశాల నుంచి 267 మంది టెన్నిస్ ప్లేయర్లు హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం దక్కించుకున్నారు.

Story first published: Monday, July 22, 2024, 9:15 [IST]
Other articles published on Jul 22, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+